ETV Bharat / sports

'నాలుగులో పంత్ సరైన నిర్ణయమే'

ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు పంపడం సరైన నిర్ణయమే అని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ తెలిపాడు. విజయ్ శంకర్ గాయం కారణంగానే పంత్​కు అవకాశమిచ్చామని స్పష్టం చేశాడు.

రోహిత్
author img

By

Published : Jul 1, 2019, 2:39 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన పోరులో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​లో విజయ్ శంకర్ స్థానంలో పంత్​కు అవకాశం దొరికింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. అయితే ఆడిన మొదటి మ్యాచ్​లోనే రిషభ్​ నుంచి భారీ ఇన్నింగ్స్​ ఆశించడం మంచిది కాదని టీమిండియా వైస్​ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

ఇంగ్లాండ్​కు చావోరేవో మ్యాచ్​.. అదీ టీమిండియాతో.. ప్రపంచకప్​లో హాట్​ ఫేవరేట్​గా బరిలోకి దిగింది మోర్గాన్ సేన. అనూహ్య ఓటములతో సెమీస్​ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. భారత్​పై గెలిచి సెమీస్​ అవకాశాలు మెరుగ్గా ఉంచుకోవాలని భావించిన ఇంగ్లాండ్​ జట్టు అదే రీతిలో ఆడింది. అయితే ఈ మ్యాచ్​లో విజయ్ శంకర్​ స్థానంలో పంత్​కు చోటు లభించింది. టీమిండియాకు ఎప్పటి నుంచో ఆందోళన కలిగిస్తోన్న నాలుగో స్థానంలో రిషభ్ బ్యాటింగ్​కు దిగాడు. భారత్ గెలిస్తే ఎలా ఉండేదో కానీ.. కోహ్లీ సేన ఓటమి తర్వాత ఈ స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.

మ్యాచ్ అనంతరం పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు రావడంపై ఓ విలేకరి రోహిత్​ను ప్రశ్నిస్తూ.. అంత కఠిన పరిస్థితుల్లో పాండ్యను కాదని పంత్​కు నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు పంపడం ఆశ్చర్యకరంగా అనిపించ లేదా అని అడిగాడు. దీనిపై రోహిత్ స్పందిస్తూ..

"ఆశ్చర్యకరం అనిపించలేదు. ఎందుకంటే మీరంతా పంత్​ను నాలుగో స్థానంలో చూడాలనుకున్నారు. టీమిండియా అభిమానులు కూడా రిషభ్ పంత్​ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఈ మ్యాచ్​ సమాధానం" అని తెలిపాడు.

"పంత్​ భారీ షాట్స్​ ఆడే ముందు మరింత ఆలోచించాలి. ప్రపంచకప్​లో పంత్​కు ఇది మొదటి మ్యాచ్​మాత్రమే. ఈ దశలో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్​ ఆశించడం కూడా మంచిది కాదు. మిడిల్​లో ఇంకాస్త సమయం వెచ్చించాలి. పిచ్ పరిస్థితులను అంచనా వేయాలి. రిషభ్​ను నాలుగో స్థానంలో పంపడం సరైన నిర్ణయమే. అతడి ప్రతిభ అందరికీ తెలుసు".
-రోహిత్, టీమిండియా వైస్ కెప్టెన్

గాయం కారణంగానే విజయ్ శంకర్ జట్టుకు దూరమయ్యాడని అన్నాడు రోహిత్. కుల్దీప్, చాహల్​కు కలిసిరాలేదని.. వారు మరింత మంచి ప్రదర్శన కనబర్చగలరని తెలిపాడు.

ఇవీ చూడండి.. 'టీమిండియా ఓటమికి ఆరెంజ్​ జెర్సీనే కారణం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
KK PRODUCTIONS – AP CLIENTS ONLY
Kishtwar, Indian-administered Kashmir - 1 July 2019
++QUALITY AS INCOMING++
1. An injured man being moved to a stretcher and carried into the hospital
2. Various of injured people being carried into the hospital
3. Group of women waiting  
4. Wide of people gathered outside the hospital  
STORYLINE:
People injured in a deadly bus crash in Indian-administered Kashmir were rushed to a local hospitals Monday.
The overcrowded minibus crashed into a gorge, killing at least 31 people and injuring another 7, officials said.
Rescue teams rushed the injured to hospitals, where all of them are in critical condition.
Officials said the bus plunged off the Himalayan mountain road as its driver negotiated a curve and rolled down into a 150-metre (500-foot) deep gorge along a rocky stream.
An investigation was underway to determine if the accident was caused by mechanical failure or driver negligence.
India has the world's deadliest roads, with about 150,000 killed and 470,000 injured annually.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.