ఇంగ్లాండ్ జట్టు ఆ దేశ ప్రధాని థెరిసా మేను కలిసింది. లండన్ డౌనింగ్ స్ట్రీట్‌లోని కార్యాలయంలో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని 15 మంది సభ్యులు ప్రపంచకప్‌ను ప్రధానికి చూపించి ఫొటో దిగారు. వీరితో కాసేపు ముచ్చటించారు ప్రధాని.
44 ఏళ్ల వరల్డ్‌కప్ కల సాకారమైనందుకు థెరిసా మే సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎంతో మంది ఈ విజయం నుంచి స్ఫూర్తి పొందుతారని చెప్పారు.
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. టైగా ముగిసిన మ్యాచ్‌లో బౌండరీ కౌంట్ ద్వారా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
ఇది చదవండి: 'మాకు రెండే ఆప్షన్లు... కోపానికి తావు లేదు'