వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో గాయపడ్డాడు స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్. తొలుత అతడికి మూడు వారాలు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది యాజమాన్యం. అందుకే మూడు నుంచి అయిదు మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని ఆశాభవం వ్యక్తం చేసింది. కాని లీగ్‌ల తర్వాత మళ్లీ జట్టులో చేరతాడని చాలా ఆశలు పెట్టుకున్న భారత జట్టుకు తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది. ధావన్‌కు తగిలిన ఎడమచేతి బొటనవేలి గాయం ఇప్పట్లో తగ్గేట్టుగా కనబడకపోవడం వల్ల అతడిని టోర్నీ నుంచి పూర్తిగా తప్పించినట్లు యాజమాన్యం ప్రకటించింది.
-
Official Announcement 🚨🚨 - @SDhawan25 ruled out of the World Cup. We wish him a speedy recovery #TeamIndia #CWC19 pic.twitter.com/jdmEvt52qS
— BCCI (@BCCI) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Official Announcement 🚨🚨 - @SDhawan25 ruled out of the World Cup. We wish him a speedy recovery #TeamIndia #CWC19 pic.twitter.com/jdmEvt52qS
— BCCI (@BCCI) June 19, 2019Official Announcement 🚨🚨 - @SDhawan25 ruled out of the World Cup. We wish him a speedy recovery #TeamIndia #CWC19 pic.twitter.com/jdmEvt52qS
— BCCI (@BCCI) June 19, 2019
ధావన్ స్పందన
గాయం కారణంగా మెగా ఈవెంట్ నుంచి తప్పుకోవడం బాధగా ఉందన్నాడు శిఖర్. అయినప్పటికీ సహచర ఆటగాళ్లతో పాటు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ట్విట్టర్ వేదికగా చిన్నపాటి వీడియోను షేర్ చేశాడు గబ్బర్.
-
I feel emotional to announce that I will no longer be a part of #CWC19. Unfortunately, the thumb won’t recover on time. But the show must go on.. I'm grateful for all the love & support from my team mates, cricket lovers & our entire nation. Jai Hind!🙏 🇮🇳 pic.twitter.com/zx8Ihm3051
— Shikhar Dhawan (@SDhawan25) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I feel emotional to announce that I will no longer be a part of #CWC19. Unfortunately, the thumb won’t recover on time. But the show must go on.. I'm grateful for all the love & support from my team mates, cricket lovers & our entire nation. Jai Hind!🙏 🇮🇳 pic.twitter.com/zx8Ihm3051
— Shikhar Dhawan (@SDhawan25) June 19, 2019I feel emotional to announce that I will no longer be a part of #CWC19. Unfortunately, the thumb won’t recover on time. But the show must go on.. I'm grateful for all the love & support from my team mates, cricket lovers & our entire nation. Jai Hind!🙏 🇮🇳 pic.twitter.com/zx8Ihm3051
— Shikhar Dhawan (@SDhawan25) June 19, 2019
ధావన్ స్థానం భర్తీ చేసేందుకు రిషభ్ పంత్ ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నాడు. ఓపెనర్‌గా శిఖర్ బదులుగా రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు. అయితే పంత్‌కు పాక్‌తో మ్యాచ్‌లో అవకాశం రాలేదు.
టీమిండియా నుంచి మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కూడా గాయపడి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో షమీకి అవకాశం ఇవ్వనున్నట్లు కోహ్లీ ప్రకటించాడు.
ఇవీ చూడండి...