భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ శిఖర్ ధావన్ ఎడమ చేతి బొటన వేలు గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీకి మూడు వారాలు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయం తెలియగానే యావత్ దేశం షాక్‌కు గురైంది. తాజాగా శిఖర్ ఓ కవితతో భారత అభిమానుల్లో మనోధైర్యం నింపాడు. ఉర్దూ కవి డా.రాహత్ ఇందోరి రాసిన ఓ కవితను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
" కొన్నిసార్లు మనం పువ్వుల్లా వికసిస్తాం. మరికొన్ని సార్లు పర్వతాలపైన మంచు పొగలా అత్యున్నతంగా ఉంటాం. మనం పైకి ఎగురుతుంటే ఎవరూ మన రెక్కలను కత్తిరించలేరు. ఎందుకంటే ధైర్యంగా విహరించగల సత్తా మనలో ఉంది" అంటూ ధావన్ సందేశాన్ని పోస్టు చేశాడు.
-
Kabhi mehek ki tarah hum gulon se udte hain...
— Shikhar Dhawan (@SDhawan25) June 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Kabhi dhuyein ki tarah hum parbaton se udte hain...
Ye kainchiyaan humein udne se khaak rokengi...
Ke hum paron se nahin hoslon se udte hain...#DrRahatIndori Ji pic.twitter.com/h5wzU2Yl4H
">Kabhi mehek ki tarah hum gulon se udte hain...
— Shikhar Dhawan (@SDhawan25) June 12, 2019
Kabhi dhuyein ki tarah hum parbaton se udte hain...
Ye kainchiyaan humein udne se khaak rokengi...
Ke hum paron se nahin hoslon se udte hain...#DrRahatIndori Ji pic.twitter.com/h5wzU2Yl4HKabhi mehek ki tarah hum gulon se udte hain...
— Shikhar Dhawan (@SDhawan25) June 12, 2019
Kabhi dhuyein ki tarah hum parbaton se udte hain...
Ye kainchiyaan humein udne se khaak rokengi...
Ke hum paron se nahin hoslon se udte hain...#DrRahatIndori Ji pic.twitter.com/h5wzU2Yl4H
తదుపరి మ్యాచ్‌లకు ఓపెనర్లుగా రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నారు. ధావన్ స్థానంలో రిషభ్ పంత్ ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు. న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్గాన్‌తో మ్యాచ్‌లకు ధావన్ బదులుగా రిషభ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్లలో ఎవరో ఒకరికి అవకాశం రానుంది.