ETV Bharat / sports

టీమిండియాకు కోచ్, టీమ్ మేనేజర్ కావలెను..!

టీమిండియాకు కోచ్, తదితర సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించనుంది బీసీసీఐ. ఇలా అన్ని పదవులకు పారదర్శకంగా ఉద్యోగులను ఎంపికచేయడం బీసీసీఐకి ఇదే మొదటి సారి.

బీసీసీఐ
author img

By

Published : Jul 16, 2019, 9:19 AM IST

టీమిండియా కోచ్, సపోర్ట్​ స్టాఫ్ పదవులకు దరఖాస్తులకు ఆహ్వానించనుంది బీసీసీఐ. ప్రస్తుతం హెడ్​ కోచ్​గా ఉన్న రవిశాస్త్రి జట్టు సిబ్బంది తిరిగి కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పూర్తైన వీరి కాంట్రాక్టును ప్రపంచకప్ నేపథ్యంలో 45రోజులు పొడిగించింది బీసీసీఐ.

ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 3 వరకు వెస్టిండీస్​తో టీ 20, వన్డే, టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత్​. ​ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, పీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తదితర సిబ్బంది ఒప్పందాన్ని పొడిగించింది.

"రెండు మూడురోజుల్లో ఈ పదవులకు సంబంధించిన దరఖాస్తులను వెబ్​సైట్​లో పొందుపరుస్తాం. టీమ్ మేనేజర్​తో పాటు శిక్షణాసిబ్బంది, కోచ్ పదవులకు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నాం" -బీసీసీఐ ప్రతినిధి.

లోథా కమిటీ సిఫార్సు మేరకు అన్ని పదవులకు పారదర్శకంగా ఉద్యోగులను ఎంపిక చేయడం బీసీసీఐకి ఇదే మొదటి సారి.

2017లో అనిల్ కుంబ్లే వైదొలిగిన తర్వాత రవిశాస్త్రితో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది బీసీసీఐ. అంతకుముందు 2014 నుంచి 2016 వరకు టీమిండియా డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వహించాడు.

ఇది చదవండి: జులై 19న విండీస్​తో సిరీస్​కు జట్టు ఎంపిక

New Delhi, Jul 16 (ANI): Old Windows users have no choice but to upgrade to the latest version as Microsoft is taking away their favourite internet games for good. The software giant has announced that it is killing its popular internet games on older Windows versions. These include Backgammon, Checkers, Spades, Hearts, Reversi, and MSN Go on Windows XP, Windows ME, and Windows 7, the official release notes. Microsoft Internet Games services on Windows XP and ME will end on July 31, 2019, while on Windows 7, the services will continue until January 22, 2020.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.