ETV Bharat / sports

టాప్​ 5లో బంగ్లాదేశ్... విండీస్​పై 7 వికెట్లతో విజయం​

ప్రపంచకప్‌లో విండీస్​తో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​ అద్భుత విజయం సాధించింది. వెస్టిండీస్​ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు బంగ్లా బ్యాట్స్​మెన్​. ఆల్​రౌండర్​ షకీబ్​ అల్​ హసన్​ బంతితోనూ, బ్యాట్​తోనూ రాణించి బంగ్లాను గెలిపించాడు.

టాప్​ 5లో బంగ్లాదేశ్... విండీస్​పై 7 వికెట్లతో విజయం​
author img

By

Published : Jun 17, 2019, 11:38 PM IST

టాంటన్​ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్​ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 322 పరుగుల భారీ లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్​ 5లోకి దూసుకెళ్లి పెద్ద జట్ల సరసన చేరింది. ఆల్​రౌండర్​ ప్రదర్శనతో మరోసారి షకిబ్​ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2015లో స్కాంట్లాండ్​పై 322 పరుగుల ఛేదనను సమం చేసింది బంగ్లాదేశ్​. ఈ గెలుపు వన్డేల్లో మూడో అతిపెద్ద ఛేదనగా, ప్రపంచకప్​లో రెండోదిగా పెద్ద ఛేదనగా ఘనత సాధించింది.

తొలుత బ్యాటింగ్​ చేసిన వెస్టిండీస్​ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తమీమ్​ ఇక్బాల్​ 53 బంతుల్లో 48 పరుగులు, సౌమ్య సర్కార్​ 23 బంత్లులో 29 పరుగులు చేసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

అత్యధిక పరుగుల వీరుడు

తొలి వికెట్ అనంతరం బరిలోకి దిగిన షకిబ్​ కెరీర్​లో మరో శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్​లో 99 బంతుల్లో 124 పరుగులతో(16 ఫోర్లు) నాటౌట్​గా నిలిచాడు. 2019 ప్రపంచకప్​లో మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు షకిబ్​ వన్డేల్లో 9 సెంచరీలు కొట్టాడు. ఈ ఏడాది వరల్డ్​కప్​లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు షకిబ్​ అల్​ హసన్​. విండీస్​పై మ్యాచ్​లో బౌలింగ్​లోనూ అదరగొట్టిన షకిబ్​ 8 ఓవర్లకు 54 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

లిట్టన్​ సిక్స్​లు...

ఓ దశలో 133 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టుకు షకిబ్​తో కలిసి ఊతమిచ్చాడు లిట్టన్​ దాస్​. 57 బంతుల్లో 76 పరుగులు(8 ఫోర్లు, 4 సిక్స్​లు) చేశాడు. వెస్టిండీస్​ బౌలర్​ గాబ్రియేల్​ వేసిన 38వ ఓవర్​లో వరుసగా మూడు కళ్లుచెదిరే సిక్స్​లతో అలరించాడు లిట్టన్​.

విండీస్​ బౌలర్లలో రసెల్​, థామస్​ చెరో వికెట్​ తీసుకున్నారు.

తొలుత టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న బంగ్లా... కరీబియన్లను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్న విండీస్​ బ్యాట్స్​మెన్​ మంచి స్కోరు సాధించారు. కానీ కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోడం వల్ల భారీగా పరుగులు చేసే అవకాశం చేజేతులా కోల్పోయారు. చివర్లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు.

హోప్​ శతకం అంచున...

వెస్టిండీస్​ హిట్టర్​ గేల్​ డకౌట్​గా వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన షై హోప్‌ 121 బంతుల్లో 96 పరుగులు( 4ఫోర్లు, సిక్స్​) చేశాడు. తృటిలో శతకం చేజార్చుకున్నా విండీస్​ ఇన్నింగ్స్​ను గాడిన పెట్టి మంచి ప్రతిభ చూపాడు. వెస్టిండీస్​ బ్యాట్స్​మెన్లలో లూయిస్‌ 67 బంతుల్లో 70 పరుగులు (6ఫోర్లు, 2సిక్స్​లు), హెట్‌మయిర్‌ 26 బంతుల్లో 50(4 ఫోర్లు, 3 సిక్స్​లు) అర్థశతకాలతో మెరిపించి కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

  • Not the result we thought we'd get. 😢 What are your thoughts on today's result?
    🌴 321/8 (50.0 0v)
    🏏Hope 96(121)
    🏏Lewis 70(67)
    BAN 322/3 (41.3 ov)
    🔥Russell 1/42
    🔥Thomas 1/52
    Bangladesh win by 7 wickets
    Scorecard: https://t.co/XrPF20fLK8 #cwc19 pic.twitter.com/7KAPczDtbP

    — Windies Cricket (@windiescricket) June 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంగ్లా బౌలర్లలో సైపుద్దీన్‌(3/72), ముస్తాఫిజుర్‌(3/59), షకిబ్‌(2/54)మంచి ప్రదర్శన చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
DONALD J. TRUMP FOR PRESIDENT CAMPAIGN HANDOUT - AP CLIENTS ONLY
Date/Location unknown
1. Various President Donald Trump's rallies, supporters and himself giving speeches with "Text "TRUMP" to 88022" on screen throughout
STORYLINE:
President Donald Trump's campaign released an ad promoting his re-election run for 2020.
The ad includes supporters at his rallies with his voice from speeches playing under video, promising to "Make America Great Again."
President Trump is expected to officially announce his second term presidential run on June 18th in Orlando, Florida.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.