ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేందుకు సిద్ధమైంది మోర్గాన్సేన.
224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు లక్ష్యాన్ని కేవలం 32.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ రాయ్ 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. రూట్, కెప్టెన్ మోర్గాన్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.
అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్ల తీసి ప్రత్యర్థిని 223 పరుగులకే కట్టడి చేశారు. స్మిత్ ఒక్కడే 85 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. వోక్స్, రషీద్ తలో మూడు వికెట్లు తీశారు. ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు.