ETV Bharat / sports

బంగ్లా పులులపై కంగారూల విజయం - ausis

నాటింగ్​హామ్ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో ఆసీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్​మన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఆసీస్​ బౌలర్లలో స్టార్క్​, కౌల్టర్​నైల్, స్టాయినిస్​ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

బంగ్లాదేశ్
author img

By

Published : Jun 20, 2019, 11:45 PM IST

Updated : Jun 22, 2019, 12:25 AM IST

బంగ్లాదేశ్​తో జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాటింగ్​హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్​ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లా చివరి వరకు పోరాడి 333 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్(102) శతకంతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మహమ్మదుల్లా(69), తమీమ్ ఇక్బాల్(62)​ అర్ధశతకాలతో రాణించారు.

ఆసీస్​ బౌలర్లలో స్టార్క్​, కౌల్టర్​నైల్, స్టాయినిస్ తలో రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. జంపా ఓ వికెట్ తీశాడు. 166 పరుగులతో ఆకట్టుకున్న ఆసీస్ బ్యాట్స్​మన్ వార్నర్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

లక్ష్య ఛేదనలో బంగ్లాకు ఆరంభంలో చుక్కెదురైంది. నాలుగో ఓవర్లోనే సౌమ్యా సర్కార్(10) రనౌట్​గా వెనుదిరిగాడు. అనంతరం షకీబ్(41) - తమీమ్​ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే షకీబ్​ను ఔట్​ చేసి స్టాయినిస్ ఈ జోడీని విడదీశాడు. కొద్ది సేపటికే తమీమ్​ను స్టార్క్​ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే లిటన్ దాస్​ను ఎల్బీడబ్ల్యూ చేశాడు జంపా.

పోరాడిన ముష్ఫకర్​, మహ్మదుల్లా

వికెట్లు కోల్పోతున్నా వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు బంగ్లా బ్యాట్స్​మెన్​ ముఫ్ఫికర్, మహ్మదుల్లా(69). ముష్ఫికర్ 97 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. ఇరువురు ధాటిగా ఆడుతూ బంగ్లా అభిమానుల్లో గెలుపుపై ఆశలు రేకిత్తాంచారు. అయితే చేయాల్సిన స్కోరు ఎక్కువ ఉండటం, పదే పదే వికెట్లు కోల్పోవడం లాంటి కారణాలతో బంగ్లా గెలవలేకపోయింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్​(166, 147 బంతుల్లో) శతకంతో రెచ్చిపోగా.. ఖవాజా(89), ఆరోన్ ఫించ్(53) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్లలో సౌమ్యా సర్కార్ 3 వికెట్లు తీశాడు.

Viral Advisory
Thursday 20th June 2019
Clients, please note the following addition to our output.
TENNIS: Nicolas Mahut inadvertently hit a ball girl in the face with a practice serve that causes her to leave the court crying ahead of his second round match against Stan Wawrinka at the Queen's Club Championships. Already running.
Last Updated : Jun 22, 2019, 12:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.