ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన ఇంగ్లాండ్- పాకిస్థాన్ మ్యాచ్‌లో ఫైన్ల మోత మోగింది. మైదానంలో దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు, స్లో ఓవర్ రేటు కారణంతో పాక్ జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజుల్లో కోత విధించారు అంపైర్లు.
అంపైర్‌పై అసహనం వ్యక్తం చేయడం, మైదానంలో అమర్యాదగా ప్రవర్తించడం వల్ల ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్, బౌలర్ జోఫ్రా ఆర్చర్ల మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. దీనికి తోడు వీరిద్దరికీ ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఇదే కారణంతో పాక్ జట్టులోని ఇతర సభ్యులపై 10 శాతం ఫైన్ విధించారు. అనంతరం ఆటగాళ్లు తమ తప్పును అంగీకరించారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్.
ఇదీ చూడండి:- ఫీల్డింగే మా కొంప ముంచింది: మోర్గాన్