ETV Bharat / sports

WC19: ఈ ఆల్​రౌండర్లు అదరగొట్టేనా...! - stokes

ఐపీఎల్​లో సత్తాచాటి మెగాటోర్నీకి సన్నద్ధం అవుతున్నారు కొంతమంది. అంతర్జాతీయ మ్యాచుల్లో ఆకట్టుకుని ప్రపంచకప్​లో అమీతుమీ తేల్చుకోనున్నారు మరికొంతమంది. వారిలో అత్యుత్తమ ఆల్​రౌండర్లుగా పేరుగాంచిన ఆటగాళ్ల వివరాలు చూద్దాం!

ఆల్​రౌండర్లు
author img

By

Published : May 20, 2019, 5:22 PM IST

ప్రపంచకప్ 2019కు అన్ని టీమ్​లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మే 30న ఇంగ్లాండ్​ వేదికగా ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీ ఆల్​రౌండర్లదని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లోయడ్ అభిప్రాయపడ్డాడు. అన్ని జట్లలో మంచి ఆల్​రౌండర్లున్నారని తెలిపాడు. అలాంటి అత్యుత్తమ ఆల్​రౌండర్లపై ఓ లుక్కేద్దామా!

ఆండ్రీ రసెల్(వెస్టిండీస్​)..

CRICKETER
రసెల్

ఈ ఐపీఎల్​ సీజన్​లో బాగా ఆడిన ఆటగాడు అని ఎవరినైనా అడిగితే.. ఆండ్రీ రసెల్ అని ఎక్కువ మంది తడుముకోకుండా బదులిస్తారు. ఆ రకంగా కోల్​కతా తరపున విధ్వంసం సృష్టించాడీ కరేబియన్ ఆటగాడు. 58 ఐపీఎల్​ మ్యాచ్​లాడిన రసెల్ 130 సిక్సులు కొట్టాడు. సగటున ప్రతి 5 బంతులకు ఓ సిక్సర్​ బాది తనేంటో చూపించాడు. జనవరి 2017లో డోప్​ పరీక్షలో విఫలమై జాతీయ జట్టుకు దూరమైన రసెల్ ఐపీఎల్​ టోర్నీలో సత్తా చాటుతున్నాడు. మీడియం పేసర్​గా వికెట్లు తీస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఐపీఎల్​లో 13 మ్యాచ్​లు ఆడిన రసెల్ 510 పరుగులు చేశాడు. ఐపీఎల్ తరహాలో వరల్డ్​కప్​లోనూ రెచ్చిపోతే.. మిగతా జట్లకు గెలుపు కష్టమే.

హార్ధిక్ పాండ్య(భారత్)..

CRICKETER
పాండ్య

రసెల్ తర్వాత ఆ రేంజ్​లో ఆకట్టుకున్న ఆల్​రౌండర్​ హార్ధిక్ పాండ్యనే. బ్యాటింగ్​, బౌలింగ్... రెండింటిలోనూ తనదైన రీతిలో సత్తాచాటుతున్నాడు. ఈ ఐపీఎల్​ సీజన్​లో ముంబయి ఇండియన్స్​ తరపున 13 ఇన్నింగ్స్​లో 402 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న హార్ధిక్ పాండ్య ప్రపంచకప్​లో భారత్​కు కీలకంగా మారాడు. ఫించ్ హిట్టర్​గా పేరొందిన పాండ్య ఈ ఐపీఎల్​లో హెలికాప్టర్​ షాట్లతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

బెన్​స్టోక్స్​(ఇంగ్లాండ్)..

CRICKETER
స్టోక్స్​

ప్రస్తుతమున్న ఆల్​రౌండర్లలో ముందువరుసలో ఉన్న ఆటగాడు బెన్​స్టోక్స్​. బ్యాటింగ్​లో ఎంతగా రెచ్చిపోతాడో.. బౌలింగ్​లోనూ అదే విధంగా ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్​ జాతీయ జట్టులో క్రియాశీల పాత్ర పోషిస్తున్న స్టోక్స్​ ఇటీవల జరిగిన పాకిస్థాన్​ సిరీస్​లో సత్తాచాటాడు. ఆ సిరీస్​లోని ఓ మ్యాచ్​లో 71 పరుగులతో పాటు మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లాండ్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. 2017 ఐపీఎల్​ సీజన్​లో ఆకట్టుకున్న స్టోక్స్​ను తర్వాత జరిగిన వేలంలో ఎక్కువ మొత్తం వెచ్చించి జట్టులోకి తీసుకుంది రాజస్థాన్. ప్రస్తుతం స్వదేశంలో జరగనున్న వరల్డ్​కప్​లో సత్తాచాటేందుకు కసరత్తులు చేస్తున్నాడు స్టోక్స్​.

మార్కస్ స్టాయినీస్​(ఆస్ట్రేలియా)..

CRICKETER
స్టాయినీస్

మార్చిలో భారత్​ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్​లో స్టాయినీస్ సత్తాచాటాడు. ఫైనల్​ మ్యాచ్​లో 140 పరుగులతో ఆకట్టుకోవడమే కాదు.. విరాట్ కోహ్లీ వికెట్ తీసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్​ను ఆసీస్ 3-2 తేడాతో గెలిచింది. అనంతరం విరాట్ మాట్లాడుతూ స్టాయినీస్ అత్యంత ప్రమాదాకారి అని అన్నాడు. భారత్​పై సిరీస్ విజయంతో పాటు ఇటీవల యూఏఈలో పాకిస్థాన్​తో జరిగిన వన్డే సిరీస్​లోనూ ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగుతున్న ఆసీస్​కు స్టాయినీస్ కీలకంగా మారాడు.

షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)..

CRICKETER
షకీబ్

ఇప్పటికే ప్రపంచ అత్యుత్తమ ఆల్​రౌండ​ర్​గా పేరు తెచ్చుకున్న షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆటగాడు. ప్రస్తుతమున్న ఆల్​రౌండర్లందరిలోనూ అనుభవజ్ఞుడు. గత దశాబ్ద కాలంగా బంగ్లాకు ఎన్నో విజయాలు అందించిన షకీబ్ గత వారం ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. ఈ కారణంగా ప్రపంచకప్​ దగ్గరకొస్తున్న తరుణంలో షకీబ్ ఆడేది లేనిది సందిగ్ధం నెలకొంది. కెప్టెన్ మోర్తాజాకు షకీబ్ లాంటి అనుభవజ్ఞుడి అవసరం చాలా ఉంది. బ్యాటింగ్​, బౌలింగ్ రెండింటిలోనూ జట్టును ఆపద సమయంలో గట్టెక్కించగల సమర్థుడు షకీబ్.

ఇది చదవండి: WC19: పాక్ జట్టులో మార్పులకు కారణం?

Bhopal (MP), May 20 (ANI): While speaking to ANI, Madhya Pradesh Leader of Opposition and BJP leader Gopal Bhargava said, "After the exit polls, a terrible administrative chaos has occurred in the state. It will fall on its own (MP government), I don't believe in horse-trading but I feel time has come and it will have to go soon."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.