ETV Bharat / sports

అందుకోసం మళ్లీ బ్యాట్ పడతా: యూవీ - యువీ తాాజా వార్తలు

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ బిగ్​బాష్ లీగ్​లో ఆడబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించాడు యూవీ. టీ20ల్లో 45 ఏళ్ల వరకూ కొనసాగొచ్చని స్పష్టం చేశాడు.

you can play T20s till 45, says Yuvraj Singh as he eyes comeback
'పంజాబ్ జట్టు​ కోసమే మళ్లీ బ్యాట్ పడతా'
author img

By

Published : Sep 10, 2020, 5:00 PM IST

Updated : Sep 10, 2020, 5:33 PM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా అతడు మనసు మార్చుకున్నాడు. మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇది టీమ్​ఇండియాకు ఆడటానికి కాదు. తన రాష్ట్రం పంజాబ్​ను దేశవాళీ టోర్నీలో విజేతగా నిలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాడట యూవీ. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు.

"దేశవాళీ పోటీల్లో పంజాబ్​కు ఆడటం ఎపుడూ సంతోషమే. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం బాగుంటుంది. నేనూ, హర్భజన్.. పంజాబ్​ టైటిల్ సాధించడానికి చాలా కష్టపడ్డాం. కానీ మా ఇద్దరి దురదృష్టవశాత్తు అది సాధ్యం కాలేదు. కెరీర్​ చివర్లో నన్ను ఎవరూ ప్రోత్సహించలేదు. అదే నా రిటైర్మెంట్​కు కారణమైంది. కానీ ఇపుడు పంజాబ్​కు టీ20 టైటిల్ సాధించిపెట్టాలని అనుకుంటున్నా. ప్రస్తుతం జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టుకు ఆడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా."

-యువరాజ్ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

జీవితాంతం క్రికెట్ ఆడటం కుదరదని తెలిపిన యూవీ.. టీ20ల్లో 45 ఏళ్ల వరకు ఆడొచ్చని వెల్లడించాడు. "దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా. నేను.. కోచ్​, మెంటార్, ఆటగాడిగా ఉంటా. నాకు ఎంతో ఇచ్చిన పంజాబ్​ కోసం ఇది చేస్తా" అని తెలిపాడు.

అలాగే బిగ్​బాష్​ లీగ్​లో ఆడటంపైనా స్పందించాడు యూవీ. బీసీసీఐ నిబంధనల మేరకే నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. పంజాబ్​పైనే ప్రస్తుతం దృష్టిపెట్టినట్లు వెల్లడించాడు.

Last Updated : Sep 10, 2020, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.