వన్డేల్లో అందరూ రాణించగలరు. కొందరు మాత్రమే బంతిని శాసించగలరు. పరుగుల వరద పారించగలరు. ఏడాదిని అగ్రస్థానంతో ముగించగలరు. ఒక్కో ఆటగాడు.. తన కెరీర్‌లో ఒక్కో దశలో ఉన్నత స్థితిలో ఉంటాడు. అలా 2010 నుంచి 2019 వరకు పదేళ్ల కాలంలో కేవలం ముగ్గురే అగ్రస్థానంలో నిలిచారు. అదీ వరుసగా 2017-2019 వరకు కింగ్ కోహ్లీ వన్డేల్లో నంబర్‌వన్‌గా.. 2013-2016 వరకు ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్, 2010-2012 వరకు దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా ఉన్నారు. వారు ఏయే సంవత్సరాల్లో ఎన్ని పరుగులు చేశారు? ఎన్ని రేటింగ్ పాయింట్లు సాధించారో తెలుసుకుందాం.
2019లో విరాట్ కోహ్లీదే వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానం

2018లో విరాట్ కోహ్లీదే వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానం

2017లో విరాట్ కోహ్లీదే వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానం

సంవత్సరం | ఆటగాడు | వ్యక్తిగత పరుగులు | రేటింగ్ | దేశం |
2016 | ఏబీ డివిలియర్స్ | 339 | 861 | దక్షిణాఫ్రికా |
2015 | ఏబీ డివిలియర్స్ | 1193 | 900 | దక్షిణాఫ్రికా |
2014 | ఏబీ డివిలియర్స్ | 879 | 887 | దక్షిణాఫ్రికా |
2013 | ఏబీ డివిలియర్స్ | 1163 | 872 | దక్షిణాఫ్రికా |
2012 | హషీమ్ ఆమ్లా | 678 | 901 | దక్షిణాఫ్రికా |
2011 | హషీమ్ ఆమ్లా | 632 | 840 | దక్షిణాఫ్రికా |
2010 | హషీమ్ ఆమ్లా | 1058 | 849 | దక్షిణాఫ్రికా |
ఇదీ చదవండి:- ఐపీఎల్ ప్రదర్శనతోనే ధోనీ జట్టులోకి: కుంబ్లే