ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్: దీప్తి శర్మ పోరాటం.. ఆస్ట్రేలియా లక్ష్యం 133

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మహిళా టీ20 ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో భారత బ్యాట్స్​ఉమెన్ తడబడ్డారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది టీమిండియా.

టీ20
టీ20
author img

By

Published : Feb 21, 2020, 2:57 PM IST

Updated : Mar 2, 2020, 1:51 AM IST

మహిళా టీ20 ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది భారత్. ఈ మ్యాచ్​లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ షఫాలీ వర్మ 15 బంతుల్లో 29 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. స్మృతి మంధాన (10), హర్మన్ ప్రీత్ కౌర్ (2) విఫలమయ్యారు.

మిడిలార్డర్​లో రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో రోడ్రిగ్స్ 26 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. దీప్తి శర్మ 49 పరుగులతో నాటౌట్​గా నిలిచి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ఫలితంగా హర్మన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో జొనాసెన్ రెండు, ఎలిస్ పెర్రీ, కిమ్మిన్స్ చెరో వికెట్ సాధించారు.

Last Updated : Mar 2, 2020, 1:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.