ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్‌లో.. న్యూజిలాండ్ బోణీ కొట్టింది. శనివారం శ్రీలంకతో జరిగిన గ్రూప్ దశ పోరులో.. కివీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ 75*(55 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్సర్) అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. ఈ క్రమంలో ఆమె ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
-
"I hope someone else can beat that record. That's the great thing about the women's game at the moment, records seem to be broken left, right, and centre."
— T20 World Cup (@T20WorldCup) February 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Sophie Devine speaks after extending her world record streak to six consecutive T20I fifties.#NZvSL | #T20WorldCup pic.twitter.com/TnBxCjOz0T
">"I hope someone else can beat that record. That's the great thing about the women's game at the moment, records seem to be broken left, right, and centre."
— T20 World Cup (@T20WorldCup) February 22, 2020
Sophie Devine speaks after extending her world record streak to six consecutive T20I fifties.#NZvSL | #T20WorldCup pic.twitter.com/TnBxCjOz0T"I hope someone else can beat that record. That's the great thing about the women's game at the moment, records seem to be broken left, right, and centre."
— T20 World Cup (@T20WorldCup) February 22, 2020
Sophie Devine speaks after extending her world record streak to six consecutive T20I fifties.#NZvSL | #T20WorldCup pic.twitter.com/TnBxCjOz0T
ఒకే ఒక్క ప్లేయర్...
ఈ మ్యాచ్‌లో ప్రదర్శనతో కెరీర్లో మరో అర్ధశతకం సాధించిన డివైన్.. వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో (పురుష, మహిళా) 4 అర్ధశతకాలకు మించి వరుసగా ఎవరూ చేయలేదు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి ఆటపట్టు 41(5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మిగతా అందరూ నిరాశపర్చారు. కివీస్ బౌలర్ జెన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించింది. డివైన్‌కు తోడు మ్యాడీ గ్రీన్ 29(20 బంతుల్లో; 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఈ క్రమంలో డివైన్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు 7 వికెట్లు తేడాతో గెలచి మెగాటోర్నీని ఘనంగా ఆరంభించింది.