కామన్వెల్త్ గేమ్స్‌లో ఇకపై క్రికెట్ పోటీలను వీక్షించవచ్చు. 2022లో జరిగే బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో మహిళా టీ 20 క్రికెట్‌ను చేర్చారు. మొత్తం 8 దేశాలు ఇందులో పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ధ్రువీకరించింది.
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో క్రికెట్‌ను చేర్చాలని చాలా రోజుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవలే మహిళా టీ-20 పార్మాట్‌ను నామినేట్ చేశారు. నేడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
"అంతర్జాతీయ క్రికెట్ సమాజానికి నిజంగా ఇది చారిత్రక సంఘటన. 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో మహిళా క్రికెట్‌ను చేర్చేందుకు ఓట్ చేసిన కామన్వెల్త్ అసొసియేషన్‌కు ధన్యవాదాలు" -మను సహానే, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్
టీ-20 ఫార్మాట్‌ను కామన్వెల్త్ గేమ్స్‌లో నిర్వహించేందుకు సరిగ్గా సరిపోతుందని మను సహానే అభిప్రాయపడ్డారు.
"ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తు క్రికెటర్లకు మంచి అవకాశం కల్పించినట్లయింది. చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగం కావడం నిజంగా మంచి అనుభవంగా మిగులుతుందని ఆశిస్తున్నా" -మను సహానే, ఐసీసీ చీఫ్ ఎగ్జిగ్యూటీవ్
కామన్వెల్త్గేమ్స్లో క్రికెట్‌ను తొలిసారిగా 1998లో చేర్చారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఆ క్రీడల్లో 50 ఓవర్ల ఫార్మాట్లో పురుషులు ఆడారు. దక్షిణాఫ్రికా జట్టు బంగారు పతకాన్ని గెల్చుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 2022లో టీ-20 ఫార్మాట్లో మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు.
ఇది చదవండి: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్..!: ఐసీసీ ప్రయత్నాలు