బంతి మెరుపు కోసం ఉమ్మును ఉపయోగించడాన్ని నిషేధించిన నేపథ్యంలో టెస్టుల్లో ప్రతి 50-55 ఓవర్లకు ఓ కొత్త బంతిని ప్రవేశపెట్టాలని సచిన్ తెందుల్కర్ అన్నాడు.
"టెస్టుల్లో పిచ్‌లు బాగా లేకుంటే ఆట ప్రమాణాలు తగ్గిపోతాయి. ఆట నెమ్మదిస్తుంది. ఇలాంటి పిచ్‌పై సహనంగా ఉండాలని బౌలర్‌కూ తెలుస్తుంది. కానీ ప్రతి 45-50 లేదా 55 ఓవర్లకు ఓ కొత్త బంతిని ఇవ్వడం ద్వారా ఆటలో ఉత్తేజం తేవచ్చు. వన్డేలో 50 ఓవర్లకే రెండు కొత్త బంతులను ఉపయోగిస్తారు కదా! అంటే 25 ఓవర్లకు ఓ బంతన్నమాట"
-సచిన్ తెందుల్కర్, భారత క్రికెట్ దిగ్గజం
ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సచిన్.. తనకిష్టమైన పలు వ్యాపకాలతో సహా కుటుంబంతో జాలీగా గడుపుతున్నాడు.
ఇది చూడండి : 'కోహ్లీ మాటలు, ప్రవర్తన చాలా తెలివిగా ఉంటాయి'