ETV Bharat / sports

కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్​పై క్లారిటీ!

ఈసారి ఐపీఎల్​లో విరాట్​ కోహ్లీ ఓపెనర్​గా బరిలోకి దిగుతాడని సోషల్​ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశాడు ఆర్సీబీ క్రికెట్​ డైరెక్టర్​ మైక్ హెసన్​.

Virat Kohli
కోహ్లీ
author img

By

Published : Aug 28, 2020, 2:23 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ కోసం దుబాయ్​కి చేరుకున్న ఫ్రాంచైజీల్లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకటి. వారం రోజుల క్వారంటైన్​ తర్వాత తొలి శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. గత సీజన్​తో పోలిస్తే ఈ సారి జట్టులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మైక్​ హెసన్​ క్రికెట్​ డైరెక్టర్ కాగా.. గ్యారీ కిర్​స్టన్​ స్థానంలో సైమన్​ కటిచ్​ను ప్రధాన కోచ్​గా నియమించారు. దీంతో పాటు అరోన్​ ఫించ్​, క్రిస్​ మోరిస్​, డేల్​ స్టెయిన్​ వంటి ఆటగాళ్ల రాకతో.. కొత్తగా కనిపిస్తున్న ఆర్సీబీ సైన్యంపై అభిమానుల అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే, ఈ సీజన్​లో విరాట్​ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఓపెనర్​గా దిగే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా సోషల్​మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెసన్ స్పందిస్తూ.. దీనిపై జట్టు ఎప్పుడూ చర్చించలేదని స్పష్టం చేశాడు.

"ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం. నిన్న రెండు గంటలపాటు మీడియాతో చర్చించా. విరాట్​ బ్యాటింగ్​ గురించి కానీ, అరోన్ ఫించ్​ బ్యాటింగ్​ స్థానంపై కానీ ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు వారిద్దరూ కలిసి బ్యాటింగ్​ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కోచ్ కోణం నుంచి చూస్తే.. జట్టు లైనప్​ ప్రకటించే వరకు ఏ విషయంపై స్పష్టత ఇవ్వలేం. ఎవరు ఎక్కడ బ్యాటింగ్​ చేయబోతున్నారో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే."

మైక్ హెసన్, క్రికెట్ డైరెక్టర్​

సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా లీగ్​ ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయో సెక్యూర్​ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.