సర్రే జట్టుకు ఆడుతోన్న ఇంగ్లీష్ ఆటగాడు జాక్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులతో చెలరేగాడు. 25 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ యువ కెరటం.. 8 ఫోర్లు, 11 సిక్సర్లతో మెరిశాడు. టీ10 మ్యాచ్లో ప్రత్యర్థి లాంక్షైర్ జట్టుపై పరుగుల వరద పారించాడు. ఫలితంగా 2013 ఐపీఎల్లో గేల్ చేసిన అత్యంత వేగవంతమైన శతకం రికార్డును తిరగరాశాడు. గేల్ ఆ మ్యాచ్లో 30 బంతుల్లో సెంచరీ చేశాడు.
- బౌండరీలే లక్ష్యం...
ప్రారంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడిన ఈ హిట్టర్.. 30 బంతుల్లో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టీఫెన్ పారీ వేసిన ఓ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేశాడు. ఈ యువ ఆటగాడి జోరుకు తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోర్ చేసింది.
8⃣ fours
— Surrey Cricket (@surreycricket) March 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
1⃣1⃣sixes including six in an over@wjacks9' 100 in 25 balls against @lancscricket 💥 pic.twitter.com/HKwfv4RXfq
">8⃣ fours
— Surrey Cricket (@surreycricket) March 21, 2019
1⃣1⃣sixes including six in an over@wjacks9' 100 in 25 balls against @lancscricket 💥 pic.twitter.com/HKwfv4RXfq8⃣ fours
— Surrey Cricket (@surreycricket) March 21, 2019
1⃣1⃣sixes including six in an over@wjacks9' 100 in 25 balls against @lancscricket 💥 pic.twitter.com/HKwfv4RXfq
అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన లాంక్షైర్ 9.3 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.