ETV Bharat / sports

'వచ్చే వారం మైదానంలో అడుగుపెడతా' - వార్నర్​ ఐపీఎల్

గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6-9 నెలలు పట్టినా.. తాను వచ్చే వారం నుంచి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ స్పష్టం చేశాడు. తమ దేశంలోని జరగనున్న ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో న్యూసౌత్​వేల్స్​ జట్టు తరఫున ఆడతానని చెప్పాడు.

Will be back in action from next week: Warner
'వచ్చే వారం మైదానంలో అడుగుపెడతా'
author img

By

Published : Feb 24, 2021, 6:59 AM IST

ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​కు ఇటీవలే తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో 6-9 నెలలు పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. కానీ, వచ్చే వారమే తాను బరిలోకి దిగుతానని వార్నర్ అంటున్నాడు.

నవంబరులో భారత్‌తో రెండో వన్డే సందర్భంగా అతడు గాయపడ్డాడు. దాంతో మూడో వన్డే, టీ20 సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులు దూరమయ్యాడు. తన గాయం తగ్గడానికి 6-9 నెలలు పట్టొచ్చని వార్నర్‌ వ్యాఖ్యానించడం వల్ల అతడు ఐపీఎల్‌కు దూరమైనట్లేనని చాలా మంది భావించారు. అయితే తన మాటలు కలకలం రేపిన నేపథ్యంలో వార్నర్‌ వివరణ ఇచ్చాడు.

"నా గాయం పూర్తిగా మానడానికి 6-9 నెలలు పట్టొచ్చని, ఈ కాలంలో నొప్పిని భరించక తప్పదని నేను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను మార్చి 4న తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నా. న్యూసౌత్‌వేల్స్‌ తరఫున ఆడతా" అని వార్నర్‌ ట్వీట్‌ చేశాడు. వార్నర్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఇదీ చూడండి: ఈసారి ఐపీఎల్​కు వార్నర్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.