పాకిస్థాన్ తరఫున తిరిగి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ దేశ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్, ఆయన సిబ్బంది తమ పదవుల నుంచి వైదొలిగిన తర్వాతే తిరిగి జట్టులోకి వస్తానని తెలిపాడు. డబ్బుల కోసమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాననే వార్తల్ని ఖండించాడు.
-
I would like to clarify that yes I will be available for Pakistan only once this management leaves. so please stop spreading fake news just to sell your story.
— Mohammad Amir (@iamamirofficial) January 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I would like to clarify that yes I will be available for Pakistan only once this management leaves. so please stop spreading fake news just to sell your story.
— Mohammad Amir (@iamamirofficial) January 18, 2021I would like to clarify that yes I will be available for Pakistan only once this management leaves. so please stop spreading fake news just to sell your story.
— Mohammad Amir (@iamamirofficial) January 18, 2021
"ప్రస్తుత యాజమాన్యం వైదొలిగితే పాకిస్థాన్ తరఫున తిరిగే ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ కట్టుకథలు నమ్మించడానికి నాపై విష ప్రచారాన్ని మానుకోండి. ఆటగాళ్లకు కాస్త వ్యవధి, స్వేచ్ఛనివ్వండి. డ్రెస్సింగ్ రూమ్లో భయానక వాతావరణానికి చరమగీతం పాడండి. అప్పుడు ప్రస్తుతమున్న క్రికెటర్లే మంచి ఫలితాలు సాధిస్తారు"
-మహ్మద్ ఆమిర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు ఆమిర్. బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ సహ మిస్బావుల్ హక్ నుంచి ఎదురైన మానసిక ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఇదీ చూడండి: నా రిటైర్మెంట్కు కారణం వాళ్లే: మహ్మద్ ఆమిర్