తన రిటైర్మెంట్పై స్పందించాడు పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఆడిన తర్వాతే ఆటకు వీడ్కోలు పలుకుతానని తెలిపాడు. ఈ టోర్నీలో సత్తాచాటి గౌరవప్రదంగా రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
"టీ20 ప్రపంచకప్ ఆడిన తర్వాతే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతా. ఆ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నా. పాక్‌ను మెగాటోర్నీ విజేతగా నిలపడమే నా లక్ష్యం. "
-మహ్మద్ హఫీజ్, పాక్ క్రికెటర్
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సిన టీ20 ప్రపంచకప్.. కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఐసీసీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయి.
2003లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన మహ్మద్ హఫీజ్.. ఇప్పటివరకు 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో 21 శతకాల్ని నమోదు చేశాడు.
ఇది చూడండి : ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కష్టమే: సీఏ ఛైర్మన్