ETV Bharat / sports

క్లీన్​స్వీప్​పై కోహ్లీసేన గురి.. పరువు కోసం విండీస్​ - india

కింగ్​స్టన్ వేదికగా వెస్టిండీస్ - భారత్ మధ్య నేడు రెండో టెస్టు జరగనుంది. సిరీస్​ క్లీన్​స్వీప్ చేసి విండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించాలనుకుంటోంది కోహ్లీసేన. ఇప్పటికే వన్డే సిరీస్, టీ 20 సిరీస్​ కోల్పోయిన కరీబియన్ జట్టు ఈ మ్యాచ్​లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది.

విండీస్ - భారత్
author img

By

Published : Aug 30, 2019, 5:09 AM IST

Updated : Sep 28, 2019, 7:57 PM IST

టీ 20 సిరీస్​ చేజిక్కించుకుంది.. వన్డే సిరీస్​నూ వదల్లేదు.. అదే జోరులో టెస్టు సిరీస్​ను కైవసం చేసేందుకు సమయాత్తమవుతోంది టీమిండియా. కరీబియన్లకు విజయం రుచి చూపించకుండానే వెస్టిండీస్​ పర్యటన ముగిద్దామనుకుంటోంది. మరోవైపు విండీస్ మిగిలిన ఒక్క టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటోంది. కింగ్​స్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నేడు జరగనుంది.

పంత్ పైనే అందరి చూపు..

విండీస్​తో జరిగిన 3 టీ-20లు మినహా మిగతా మ్యాచ్​ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు టీమిండియా కీపర్ రిషభ్​ పంత్​. 0, 4, 65*, 20, 0, 7 విండీస్ పర్యటనలో పంత్ గణాంకాలివి. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనవుతూ వికెట్​ను సమర్పించుకుంటున్నాడీ యువ బ్యాట్స్​మన్​.

MATCH
రిషభ్ పంత్

ఇప్పటికే మరో వికెట్ కీపర్​ బ్యాట్స్​మన్ వృద్ధిమాన్ సాహా, ఆంధ్ర క్రికెటర్ కోన్ భరత్ తమ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తుది జట్టులో పంత్​ ఉంటాడా లేదా సాహా, భరత్​.. ఇద్దరిలో ఒకరిని తీసుకుంటారా అనేది చూడాలి.

మయాంక్ ఉంటాడా..

తొలి టెస్టులో రోహిత్​ను కాదని మయాంక్ అగర్వాల్​కు అవకాశం కల్పించారు. అయితే ఆ మ్యాచ్​లో విఫలమయ్యాడు. మయాంక్​కు మరో అవకాశమిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో రోహిత్​ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సత్తాచాటిన బౌలర్లు..

బౌలింగ్ విషయానికొస్తే మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇషాంత్ ప్రత్యర్థిని దెబ్బతీయగా.. రెండో ఇన్నింగ్స్​లో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. మొత్తంగా ఆ టెస్టులో వీరిద్దరూ(8+6) వికెట్లు తీశారు. మరోసారి వీరు విజృంభిస్తే విండీస్​కు పరాభవం తప్పదు.

MATCH
బుమ్రా

బలంగా మిడిల్ ఆర్డర్

బ్యాటింగ్​లో టాపార్డర్​ బ్యాట్స్​మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా రహానే రెండు ఇన్నింగ్స్​ల్లోనూ ఆదుకున్నాడు. 81, 102 స్కోర్లతో విండీస్​కు గెలుపు దూరం చేశాడు.

MATCH
ఆకట్టుకున్న రహానే

తొలి ఇన్నింగ్స్​లో జడేజా అర్ధశతకం, హనుమ విహారి 93 పరుగులతో భారత్​కు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు.

పరాభవం నుంచి తప్పించుకుంటుందా..

విండీస్​ విషయానికొస్తే వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. టాప్ క్లాస్ ఆటగాళ్లు ఆ జట్టు సొంతమైనా.. జట్టుగా ఆడటంలో విఫలమవుతున్నారు. షిమ్రాన్ హిట్మైర్, షాయ్ హోప్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. బ్యాట్స్​మెన్ ఎంతలా తడబడుతున్నారంటే తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​ల్లో ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు. రెండో ఇన్నింగ్స్​లో వంద పరుగులకే ఆలౌటై అప్రతిష్ఠ మూటగట్టుకుంది కరీబియన్ జట్టు.

బౌలింగ్​లో ఫర్వాలేదనిపిస్తున్నా.. సమష్టిగా రాణించలేకపోతున్నారు. కొత్త బంతితో ఆకట్టుకుంటున్న గాబ్రియేల్​, కీమర్ రోచ్​కు మిగతా వారి నుంచి తోడ్పాటు కరవైంది. జట్టు ఎక్కువగా వీరిద్దరిపైనే ఆధారపడుతోంది. ఇతరుల నుంచి వీరికి మద్దతు అవసరం.

స్వదేశంలో జరుతున్న టీ-20, వన్డే సిరీస్​ కోల్పోయిన విండీస్ టెస్టు సిరీస్​పైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే మొదటి టెస్టులో గెలిచిన టీమిండియా వారి ఆశలపై నీళ్లు చల్లింది. కనీసం రెండో టెస్టులోనైనా గెలిచి సిరీస్​ సమం చేయాలని భావిస్తోంది.

ఇది చదవండి: ధోని లేకుండానే సఫారీలతో భారత్​ టీ-20 పోరు

New Delhi, Aug 29 (ANI): Prime Minister Narendra Modi met advisor of France President Emmanuel Bonne on August 29. Meanwhile, PM Modi also chaired a meeting with Asian Development Bank led by its President Takehiko Nakao.
Last Updated : Sep 28, 2019, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.