గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆ సిరీస్‌లోనే విండీస్ పేసర్ కేసరిక్ విలియమ్స్, కోహ్లీల మధ్య వివాదం రాజుకుంది. అయితే, దానంతటికీ కారణం టీమ్‌ఇండియా కెప్టెనేనని, తొలి టీ20లో అతడి ప్రవర్తన వల్లే తమ మధ్య అగ్గి రాజుకుందని వెల్లడించాడు కేసరిక్. తాజాగా 'ఫస్ట్‌పోస్టు'తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. అసలా సిరీస్‌లో ఏం జరిగిందనే విషయంపై స్పందించమని కోరగా అతడిలా చెప్పుకొచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"తొలి మ్యాచ్‌లో కోహ్లీ నా వద్దకొచ్చి ఇలా అన్నాడు. నువ్వు నన్ను జమైకాలో బోల్తా కొట్టించావ్. ఈసారి నీకా అవకాశం ఇవ్వనని చెప్పాడు. దాంతో నేను ఆశ్చర్యపోయాను. అది 2017లో జరిగితే ఇప్పుడు 2019లో ఇంకా గుర్తు పెట్టుకున్నాడా అనుకున్నాను. తర్వాత నా బౌలింగ్‌లో అతడు సింగిల్ తీస్తుంటే అనుకోకుండా అడ్డుగా వెళ్లడం వల్ల అక్కడి నుంచి మా మధ్య వైరం మొదలైంది"
--కేసరిక్ విలియమ్స్, విండీస్ పేసర్
"ఇక ఆ తర్వాత కోహ్లీ ఏదో అనడం ప్రారంభించాడు. మళ్లీ నన్ను రెచ్చగొడుతూ ఈ రోజు నీ బౌలింగ్‌లో అస్సలు ఔట్ కానని అన్నాడు. దాంతో నోరు మూసుకొని బ్యాటింగ్ చేయమని చెప్పాను. ఆపై అతడు చెలరేగిపోయి టీమ్‌ఇండియాను గెలిపించాడు. దాంతో నా ముందు నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తర్వాత హైదారబాద్ నుంచి కేరళ వెళుతుండగా విమానంలోనూ నన్ను చూస్తూ నవ్వాడు. దాంతో తర్వాతి మ్యాచ్‌లో అతడిని కచ్చితంగా ఔట్ చేయాలని నిర్ణయించుకున్నా. అలాగే రెండో టీ20లో కోహ్లీని పెవిలియన్ చేర్చా. కానీ మూడో మ్యాచ్‌లో అతడు చెలరేగిపోయాడు. నా చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి మళ్లీ కవ్వించాడు. కానీ కెప్టెన్ పొలార్డ్ నన్ను సముదాయించి బౌలింగ్ చేయమన్నాడు. అయితే చివరికి విరాట్ టీమ్‌ఇండియాను గెలిపించాడు" అని కేసరిక్ వివరించాడు.
ఆ సిరీస్‌లో టీమ్‌ఇండియా విండీస్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రెండో టీ20లో మినహా తొలి, మూడో మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">