ETV Bharat / sports

'ధోనీని అక్కడ మిస్సయినా ఇక్కడ చూస్తాం'

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీని నీలం రంగు జెర్సీలో చూడకపోయినా.. పసుపు రంగు జెర్సీలో అతడి ఆటను ఆస్వాదిద్దామని అన్నాడు టీమ్ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్ శర్మ. ధోనీ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓ ట్వీట్ చేశాడు హిట్​మ్యాన్.

We miss him in blue but we have him in yellow, says Rohit
'టీమ్​ఇండియాలో కాకపోతే..ధోనీని సీఎస్కేలో చూస్తాం'
author img

By

Published : Aug 17, 2020, 3:15 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. దీనిపై టీమ్ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ ట్విట్టర్​లో స్పందిస్తూ.. ధోనీకి తనదైన రీతిలో వీడ్కోలు చెప్పాడు.

  • One of the most influential man in the history of Indian cricket👏His impact in & around cricket was massive. He was a man with vision and a master in knowing how to build a team. Will surely miss him in blue but we have him in yellow.

    See you on 19th at the toss @msdhoni 👍😁 pic.twitter.com/kR0Lt1QdhG

    — Rohit Sharma (@ImRo45) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"భారత క్రికెట్​లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ధోనీ. క్రికెట్​లోనే కాకుండా బయట ప్రపంచంలోనూ అతని ప్రభావం భారీగా ఉంది. ధోనీ ముందుచూపు గల వ్యక్తి. జట్టును ఎలా తీర్చిదిద్దాలో అతడికి బాగా తెలుసు. అతడిని నీలం జెర్సీలో చూడలేకపోయినా.. పసుపు రంగు జెర్సీలో తన ఆటను చూస్తాం."

- రోహిత్​ శర్మ, టీమ్ఇండియా వైస్​ కెప్టెన్​

స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన వీడ్కోలు ప్రకటిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు ధోనీ. 'క్రికెట్​ కెరీర్‌లో నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ధోనీ పేర్కొన్నాడు. అమితాబ్​ బచ్చన్​ నటించిన 'కబి కబి' సినిమాలోని 'మై పల్​ దో పల్​ కా షాయర్​ హు' పాటతో ఆ వీడియోను రూపొందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.