ETV Bharat / sports

'భారత్​లోనే ఐపీఎల్.. మరో ఆలోచన లేదు' - అరుణ్ ధుమాల్

ఐపీఎల్​ 2021 కోసం ప్రత్యామ్నాయ వేదికను వెతికే అవసరం లేదన్నారు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్. భారత్​లో పరిస్థితులు మెరుగవుతాయని నమ్ముతున్నట్లు చెప్పారు.

We are not looking at back-up for IPL, working with govt. for getting our players vaccinated: Dhumal
'భారత్​లోనే ఐపీఎల్.. మరో ఆలోచన లేదు'
author img

By

Published : Jan 30, 2021, 8:07 PM IST

Updated : Jan 30, 2021, 8:50 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ (ఐపీఎల్) -2021​ వేదిక గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వైఖరి తెలియజేసింది. ప్రస్తుతానికి భారత్ వెలుపల ప్రత్యామ్నాయ వేదిక కోసం చూడాల్సిన అవసరం లేదని సంస్థ భావిస్తోంది. కొవిడ్ వేళ గతేడాది లీగ్​ను యూఏఈలో నిర్వహించగా.. ఈ సారి భారత్​లోనే నిర్వహిస్తామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్​ ధీమా వ్యక్తంచేశారు.

"ఐపీఎల్​ను భారత్​లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. అలా చేయగలమని నమ్మకంగా ఉన్నాం. అందుకే ప్రత్యామ్నాయ వేదిక గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి యూఏఈ కన్నా భారతే భద్రమైనది. పరిస్థితులు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నాం" అని ధుమాల్ చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే మైదానాల్లోకి 25-50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఐపీఎల్ 2021: మరోసారి టైటిల్​​ స్పాన్సర్​గా వివో!

Last Updated : Jan 30, 2021, 8:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.