టీమ్ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు 600-700 చేయడమే తమ లక్ష్యమని చెప్పాడు ఇంగ్లాండ్ సారథి జో రూట్. ఇప్పటికే 128 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు రెండో రోజు(శనివారం) ఆటలో భారీ స్కోరు చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడి వచ్చింది ఇంగ్లాండ్. అయితే అక్కడి పిచ్ పరిస్థితులతో ఇక్కడి వాటిని పోల్చలేమని అన్నాడు రూట్. ఇక్కడి పిచ్‌పై స్పిన్, రివర్స్ స్వింగ్, బౌన్స్ ఎక్కువగా అవుతాయని చెప్పాడు. ఈ పర్యటన పెద్ద సవాలు లాంటిదని వెల్లడించాడు.
ఈ మ్యాచు రూట్‌కు 100వ టెస్టు. ఈ పోరులో శతకం(128) బాదటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు రూట్. ఇది తనకెంతో ప్రత్యేకమైనదని చెప్పాడు. భవిష్యతులో మరిన్ని శతకాలు సాధించి.. తమ జట్టును విజయం వైపు నడిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో డొమినిక్ సిబ్లే 87 పరుగులు చేయడంపై ప్రశంసలు కురిపించాడు. అతడు మంచి ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు.
ఇదీ చూడండి: 100వ టెస్టులో రూట్ @100