ETV Bharat / sports

ఒకే మ్యాచ్​లో నాథన్​కు రెండు రికార్డులు సాధ్యమేనా?

author img

By

Published : Jan 13, 2021, 12:59 PM IST

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నాడు. టీమ్ఇండియాతో ఆడనున్న నాలుగో టెస్టుతో.. ఆసీస్​ తరఫున 100 టెస్టులాడిన 13వ ఆటగాడిగా నిలవనున్నాడు. దీంతో పాటు టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయికి దగ్గరయ్యాడు.

Watch| Pretty excited: Nathan Lyon on playing his 100th Test match
అరుదైన రికార్డుకు చేరువలో లియోన్

ఆస్ట్రేలియా తరఫున 100 టెస్టులాడిన జాబితాలో చేరనున్నాడు స్పిన్నర్ నాథన్ లియోన్. భారత్​తో బ్రిస్బేన్​లో ఆడబోయే మ్యాచ్​తో ఈ ఘనత సాధించనున్నాడు. దీంతో వంద టెస్టులు ఆడిన 13వ ఆస్ట్రేలియన్​​ క్రికెటర్​గా నిలవనున్నాడు. బోర్డర్-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా జరుగనున్న ఆఖరి టెస్టు జనవరి 15న బ్రిస్బేన్​ వేదికగా ప్రారంభం కానుంది.

అంతర్జాతీయ టెస్టుల్లో తన ప్రయాణంపై లియోన్​ బుధవారం స్పందించాడు. "చాలా ఆనందంగా ఉంది. కానీ, అస్సలు గర్వంగా భావించడం లేదు" అని అన్నాడు.

400 వికెట్ల మైలురాయి
టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయికి నాథన్​ లియోన్ చేరువలో ఉన్నాడు. ఇప్పటికే 396 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. భారత్​తో నాలుగో టెస్టులో ఈ ఘనత సాధిస్తానని ఆశాభావంతో ఉన్నాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియాపై స్ట్రెయిన్ ప్రభావం.. కఠిన క్వారంటైన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.