ETV Bharat / sports

ఇదిగో.. ఇంట్లో నేను చేసే పని ఇదే! - Rahul Is Keeping Himself Busy While On Self-Isolation

కరోనా వైరస్ ప్రభావంతో టీమిండియా ఆటగాళ్లు ఇంటిపట్టునే ఉంటున్నారు. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్నారు. ఈ సమయంలో ఇంటివద్ద తాను ఏం చేస్తున్నది చెెబుతూ నెట్టింట్లో ఓ వీడియో షేర్ చేశాడు టీమిండియా ఆటగాడు రాహుల్.

రాహుల్
రాహుల్
author img

By

Published : Mar 20, 2020, 2:24 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు ఇంటికే పరిమితమైపోయారు. కేఎల్ రాహుల్ కూడా ఇంటి వద్దే సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఈ ఆటగాడు సామాజిక మాధ్యమాల్లో తన రోజు ఎలా గడుస్తుందో ఓ వీడియో ద్వారా వివరించాడు.

ఈ వీడియోలో మొదట కాసేపు బ్యాట్, బంతితో గడిపిన రాహుల్ తర్వాత గేమ్ ఆడుతూ, అనంతరం పుస్తకం చదువుతూ, కాసేపు మొబైల్​ చూస్తూ కనిపించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఈ ఆటగాడు దానికి 'స్టే హోమ్ ఛాలెంజ్'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

కొంతకాలంగా మంచి ఫామ్​లో కనిపిస్తోన్న రాహుల్ వన్డే, టీ20ల్లో సత్తచాటుతున్నాడు. న్యూజిలాండ్​తో జరిగిన ఐదు టీ20ల సిరీస్​లో మొత్తం 224 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్​లో ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్​గా ఘనత వహించాడు.

ఈ ఐపీఎల్​ సీజన్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​కు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు రాహుల్. ఇతడి సారథ్యంలో జట్టు ఈసారి మంచి ప్రదర్శన చేస్తుందని భావిస్తోంది యాజమాన్యం.​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.