ETV Bharat / sports

పంత్​ భయంతోనే డిక్లేర్​ చేయలేదు!: రూట్​ - డిక్లేర్​పై జో రూట్​ స్పందన్​

టీమ్​ఇండియాతో తొలి టెస్టులో 400పరుగులు దాటినా తాము డిక్లేర్​ చేయకపోవడానికి కారణం పంత్​ దూకుడుగా అడటమే కారణమని చెప్పాడు ఇంగ్లాండ్​ సారథి జో రూట్​. కాగా, తమ జట్టు బౌలర్​ జేమ్స్​ అండర్సన్​.. ఓకే ఓవర్​లో గిల్​, రహానెను ఔట్​ చేయడం 2005 యాషెస్​ సిరీస్​లో ఫ్లింటాఫ్​ ఆడిన విధానాన్ని గుర్తుకుతెచ్చిందన్నాడు.

panth
పంత్​
author img

By

Published : Feb 9, 2021, 8:40 PM IST

ఇంగ్లాండ్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​ను ప్రశంసించాడు ఆ జట్టు సారథి జో రూట్​. ​అతడిలాంటి సీనియర్​ ఆటగాడు ఉండటం వల్ల తన పని సులువైందని అన్నాడు. టీమ్​ఇండియాతో జరిగిన తొలి టెస్టులో నాలుగో ఇన్నింగ్స్​లో గిల్(26వ ఓవర్లో రెండో బంతికి)​, రహానె(26వ ఓవర్లో 5వ బంతికి)ను ఓకే ఓవర్​లో 3 బంతుల వ్యవధిలో ఔట్​ చేశాడు అండర్సన్​. దీన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన రూట్​.. ఈ సంఘటన 2005 యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ ఫ్లింటాఫ్​ ఆడిన ఆటతీరును గుర్తుచేసిందన్నాడు.

ఆ సిరీస్​లో ఫ్లింటాఫ్​.. ఆసీస్​ మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్​, జస్టిన్​ లాంగర్​ను ఓకే ఓవర్​లో మూడు బంతుల తేడాలో పెవిలియన్​ చేర్చాడు. అదే సంఘటన తనకు గుర్తుకు వచ్చిందన్నాడు. అతడిది కష్టపడే వ్యక్తిత్వమని కొనియాడాడు. టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​లో కోహ్లీ(72) వికెట్​ను తీసిన స్టోక్స్​ను ప్రశంసలతో ముంచెత్తాడు రూట్​. అండర్సన్​, రూట్​ జట్టులోని మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తి అన్ని​చెప్పాడు.

పంతే కారణం..!

టీమ్​ఇండియాతో తొలి టెస్టులో 400పరుగులు దాటిన తర్వాత ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​ను డిక్లేర్​ చేస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఇంగ్లీష్​ జట్టు బ్యాటింగ్​ను కొనసాగించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్​ డిక్లేర్​ చేయకపోవడానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. అందులో పంత్​ కూడా ఓ కారణం. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో టీమ్​ఇండియా 328 పరుగులు ఛేదించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. పంత్‌ (89*) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోసారి భారత్‌ అలాంటి ఘనత సాధిస్తుందేమోననే సందేహంతో ఆలౌటయ్యే వరకు ఇంగ్లాండ్‌ ఆడిందని పలువురు అభిప్రాయపడ్డారు. అంతేగాక తొలి ఇన్నింగ్స్‌లో పంత్ (91) బ్యాటింగ్‌ చూసి 400 లక్ష్యం కూడా భారత్‌కు సరిపోదని భావించి ఉంటారని విశ్లేషించారు. 73/4తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు.

అయితే మ్యాచ్​ అనంతరం.. తాము డిక్లేర్​ చేయకపోవడానికి పంత్​యే కారణమని అంగీకరించాడు రూట్​.

"పంత్​ ఒక్క సెషన్​ ఆడినా అద్భుతాలు చేస్తాడు. అయినా నేను వికెట్లు పడగొట్టాలని అనుకోలేదు. మా బౌలర్లు వికెట్లు ఎలా తీయాలనే విషయమై ప్రత్యామ్నాయ దారులు కనుగొంటారని ఆశించాను. మేము అవకాశాలను సృష్టించుకోవాలనుకున్నాము. అందుకే డిక్లేర్​ చేయలేదు." అని రూట్​ అన్నాడు.

ఇదీ చూడండి: ఆ భయాలతోనే ఇంగ్లాండ్ డిక్లేర్‌ చేయలేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.