టీమ్‌ఇండియా క్రికెటర్ వసీమ్ జాఫర్ ట్విట్టర్‌లో చెలరేగిపోతున్నాడు. నిత్యం ఎవర్నో ఒకర్నీ ట్రోల్ చేస్తూ సరదా మీమ్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర పోస్టు చేశాడు. తొలుత ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ఓ ట్వీట్ చేస్తూ.. ఆటగాళ్లు, జట్ల పేర్లు చెప్పకుండా మీ ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్ ఏదని అడిగింది. దానికి స్పందించిన జాఫర్ అశ్విన్‌ను ట్యాగ్ చేసి ఓ మీమ్‌ను రీట్వీట్ చేశాడు. అందులో లగాన్‌లోని ఓ క్రికెట్ సన్నివేశాన్ని జత చేశాడు. ఆమిర్ బ్యాటింగ్ చేస్తుండగా అవతలి ఎండ్‌లో ఉండే ఓ కుర్రాడు క్రీజు వదిలి ముందుకు రావడం వల్ల బౌలర్ మన్కడింగ్ చేసే సన్నివేశం అది. దీని ద్వారా గతేడాది ఐపీఎల్‌లో అశ్విన్ రాజస్థాన్ బ్యాట్స్‌మన్ బట్లర్‌ను ఇలాగే ఔట్ చేసిన మ్యాచ్ ఇష్టమని చెప్పకనే చెప్పాడు.
ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచ క్రికెట్‌ను రెండు వర్గాలుగా విభజించింది. కొందరు అశ్విన్ చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతడు నియమాలకు కట్టుబడే ఆడాడని మద్దతు తెలిపారు. అయితే, ఈ ఏడాది దిల్లీ తరఫున ఆడిన అశ్విన్ ఓ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఫించ్‌ను ఇలాగే ఔట్ చేసే అవకాశం ఉన్నా హెచ్చరించి వదిలేశాడు. ఇప్పుడు ఆ వివాదాస్పద అంశంపై వసీమ్ జోక్ చేయగా అశ్విన్ బదులిస్తూ సరదాగా నవ్వుకున్నాడు.
-
Cc: @ashwinravi99 😉 https://t.co/mFv9hv5ZqW pic.twitter.com/r4O8dTrhLz
— Wasim Jaffer (@WasimJaffer14) November 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cc: @ashwinravi99 😉 https://t.co/mFv9hv5ZqW pic.twitter.com/r4O8dTrhLz
— Wasim Jaffer (@WasimJaffer14) November 21, 2020Cc: @ashwinravi99 😉 https://t.co/mFv9hv5ZqW pic.twitter.com/r4O8dTrhLz
— Wasim Jaffer (@WasimJaffer14) November 21, 2020