ETV Bharat / sports

పంత్​కు వీలైనన్ని అవకాశాలు ఇవ్వాల్సిందే: లక్ష్మణ్ - laxman

ఈసారి టీ20 వరల్డ్​ కప్​కు భారత్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 సిరీస్​ కీలకంగా మారిందని మాజీ క్రికెటర్ వీవీఎస్​ లక్ష్మణ్​ అభిప్రాయపడ్డాడు. ఈ పొట్టి ప్రపంచ కప్​కు ముందు యువ ఆటగాడు రిషభ్​ పంత్​, కేఎల్​ రాహుల్​కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని తెలిపాడు.

vvs laxman opinion on team india
పంత్​కు వీలైనన్ని అవకాశాలు ఇవ్వాల్సిందే: లక్ష్మణ్
author img

By

Published : Mar 11, 2021, 8:10 AM IST

మరో ఏడు నెలల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్​కు ముందు.. ఇంగ్లాండ్​తో సిరీస్​ సన్నాహకం లాంటిదని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్​ లక్ష్మణ్​ తెలిపాడు. రిషభ్ పంత్​, కేఎల్​ రాహుల్​ను తుది జట్టులోకి తీసుకొని మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్​ఇండియాకు సూచించాడు.

తొలి మ్యాచ్​లో ఓడినా అద్భుతంగా పుంజుకుని టెస్టు సిరీస్​ను సాధించడం టీమ్​ఇండియాకు ఇది వరుసగా రెండోసారని లక్ష్మణ్ వెల్లడించాడు. ఈ విజయాలు ఆటగాళ్ల నైపుణ్యానికి, పట్టుదలకు, దృఢ సంకల్పానికి గొప్ప నిదర్శనమని పేర్కొన్నాడు. బయో బబుల్​లో మానసికంగా కఠిన పరీక్ష ఎదుర్కొంటూ సాగిన ఆస్ట్రేలియా పర్యటన అనంతరం.. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్​ఇండియా విఫలం కావడం అర్థం చేసుకోదగినదేనని తెలిపాడు.

"రెండో టెస్టు సమయానికి కోహ్లీ బృందం రేసులోకి వచ్చింది. ఇంగ్లాండ్​ చతికిలపడింది. సిరీస్​ను 3-1తో ఘనంగా ముగించిన టీమ్​ఇండియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు అర్హత పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. ఇప్పుడు అందరి చూపు పరిమిత ఓవర్ల క్రికెట్​పైనే. ఎర్ర బంతితో పోల్చుకుంటే తెల్ల బంతితో ఇంగ్లాండ్​ జట్టు ప్రమాదకరమైంది. 2015 ప్రపంచకప్​లో తొలి దశలోనే నిష్క్రమించిన ఇంగ్లాండ్​ ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆ జట్టులో ఆఖరి వరుస బ్యాట్స్​మెన్​ కూడా పరుగులు రాబట్టగలరు. ఈ సవాల్​ను అధిగమించడంపైనే ప్రస్తుతం భారత దృష్టంతా." అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

"మరో ఏడు నెలల్లో ఆరంభమయ్యే టీ20 ప్రపంచ కప్ తుది సన్నాహకానికి ఈ సిరీస్ ఆరంభంలాంటిది. మధ్యలో ఐపీఎల్​ ఉన్నప్పటికీ టీ20 ప్రపంచ కప్​లో పోటీపడే ఆటగాళ్లపై జట్టు వ్యూహ బృందం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి ఉంటుంది. దేశవాళీ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లో నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్​, ఇషాన్​ కిషన్​, రాహుల్​ తెవాతియాలకు తగిన గుర్తింపు లభించింది. అయితే తుది జట్టులో ఆడేందుకు వారు నిరీక్షించాల్సి రావొచ్చు. రిషభ్ పంత్​కు టీ20, వన్డే ఫార్మాట్లలో అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం అతడు అద్భుత ఫామ్​లో ఉన్నాడు. అతడి విశ్వాసం ఆకాశమంత ఎత్తులో ఉంది. రోహిత్​కు తోడుగా ఓపెనింగ్​లో రాహుల్​నే పంపాలి. ధావన్​ను తప్పించాల్సి వచ్చినా తప్పదు."

-వీవీఎస్​ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్.

ఇదీ చదవండి: పొట్టి ప్రపంచకప్ ముందు మనోళ్లు సత్తా చాటేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.