ETV Bharat / sports

ఐపీఎల్​లో 20 వేలకు పైగా కరోనా టెస్టులు - ఐపీఎల్ తాజా వార్తలు

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​లో మొత్తంగా 20 వేలకు పైగా కరోనా టెస్టులు చేయనున్నారు. ఈ విషయాన్ని సదరు హెల్త్ కేర్​ ప్రకటించింది. పరీక్షలతో పాటే ప్రత్యేక వైద్య సదుపాయలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

ఐపీఎల్​లో 20 వేల కరోనా టెస్టులు
ఐపీఎల్ కొవిడ్ పరీక్షలు
author img

By

Published : Aug 26, 2020, 2:23 PM IST

ఐపీఎల్ కోసం ఇప్పటికే దుబాయ్ చేరుకున్న క్రికెటర్లు.. వివిధ హోటల్స్​లో ఆరురోజుల క్వారంటైన్​లో ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి 1, 3, 6 రోజుల్లో కరోనా పరీక్షలు జరపనున్నారు. ఇందుకోసం వీపీఎస్ హెల్త్​కేర్​ను బీసీసీఐ అధికారికంగా నియమించింది. మొత్తం టోర్నీ జరిగినన్ని రోజులు, ఈ సంస్థ 20 వేలకు పైగా టెస్టులు చేయనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థే ప్రకటించింది.

"ఐపీఎల్​లో పాల్గొనే క్రికెటర్లతో పాటు జట్ల సహాయ సిబ్బంది, ఫ్రాంఛైజీస్, బీసీసీఐ అధికారులు, ఐపీఎల్ స్టేక్ హోల్డర్స్​లకు కరోనా టెస్టులు చేయనున్నాం. వీటితో పాటే ఇతర వైద్య సదుపాయాలు సమకూర్చే విషయమై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నాం" -వీపీఎస్ హెల్త్​కేర్ ప్రకటన

సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ మ్యాచ్​లు జరగనున్నాయి. వీటిని అబుదాబీ, షార్జా, దుబాయ్​ మైదానాల్లో నిర్వహించనున్నారు. తొలి మూడు పరీక్షల్లో నెగటివ్​గా తేలిన వాళ్లే బయో బబుల్​లోనికి అడుగుపెడతారు. ఆ తర్వాత కూడా ప్రతి ఐదు రోజులకు ఓసారి అందరికీ కరోనా పరీక్షలు జరుపుతారు. పాజిటివ్​గా తేలిన వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.