రాజ్‌కోట్ వేదికగా సోమవారం ప్రారంభమైన రంజీట్రోఫీ ఫైనల్లో బంగాల్, సౌరాష్ట్ర జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు మొదటి రోజు ఆట పూర్తయ్యే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది.
బరోట్ (54), విశ్వరాజ్ జడేజా (54) అర్ధసెంచరీలతో రాణించారు. హర్విక్ దేశాయ్ (38) ఫర్వాలేదనిపించాడు. చేతన్ సకారియా (4), షెల్డన్ జాక్సన్ (14) విఫలమయ్యారు. ఫలితంగా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 206 పరుగులు చేసింది.
జ్వరంతో బాధ పడుతున్న పుజారా
టీమిండియా టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్ పుజారా.. ఈ మ్యాచ్‌లో సొంత టీమ్ సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఈ క్రికెటర్.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 24 బంతుల్లో 5 పరుగులు చేసి మైదానాన్ని వీడాడు. రెండోరోజు పుజారా ఆట కొనసాగిస్తాడని ఆ జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ వెల్లడించాడు.
ఇదీ చూడండి.. రంజీట్రోఫీ ఫైనల్లో టీమిండియా టెస్టు స్పెషలిస్టు