ETV Bharat / sports

వారు ఘన వీడ్కోలుకు అర్హులు: భజ్జీ

సెహ్వాగ్​, గంభీర్​, లక్ష్మణ్​లు ఘనమైన వీడ్కోలుకు అర్హులని.. కానీ, వారు దాన్ని పొందలేక పోయారని తెలిపాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​. క్రికెట్​లో ఆటగాళ్ల ప్రదర్శనతోనే వారికి గౌరవం లభిస్తుందని అన్నాడు.

author img

By

Published : Jun 15, 2020, 5:34 AM IST

Virender Sehwag, Gautam Gambhir, VVS Laxman Deserved Better Farewell, Says Harbhajan Singh
వారికి ఘనమైన వీడ్కోలు లభించలేదు: భజ్జీ

క్రికెట్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రమే ఘనమైన వీడ్కోలుకు అర్హులని అన్నాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ హర్భజన్​ సింగ్. ప్రస్తుతం ఉన్న యువ క్రికెటర్లందరికీ ఇలాంటి ఫెయిర్​వెల్​ కచ్చితంగా లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

"నేను ఆడిన చివరి వన్డే సిరీస్​లో ఆరు వికెట్లు పడగొట్టాను. కానీ, మేము సిరీస్​ గెలవలేకపోయాం. ఆ తర్వాత నేను ఎప్పుడూ భారత జట్టు తరపున ఆడలేదు. నాకు సహకారం లభించని విషయాల గురించి భవిష్యత్​లో వివరంగా మాట్లాడుతా. వీరేంద్ర సెహ్వాగ్​, గౌతమ్​ గంభీర్​, వీవీఎస్​ లక్ష్మణ్​లు ఘనమైన వీడ్కోలుకు అర్హులు. కానీ, వాళ్లకు అలా జరగలేదు. ఒకవేళ క్రికెటర్లకు మనం గౌరవం ఇవ్వకపోతే బయటి వ్యక్తులెవరూ వారికి గౌరవాన్ని ఇవ్వరు. నా విషయంలో ఏదైతే జరిగిందే అది మరో వ్యక్తికి జరగకూడదని ఆశిస్తున్నా".

- హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా స్పిన్నర్​

టీమ్​ఇండియా క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడటానికి అనుమతించాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్​ సింగ్​ భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఎవరైతే భారత జట్టు కాంట్రాక్టులు లేకుండా ఉన్నారో వారికి విదేశీ టోర్నీల్లో ఆడే అవకాశం ఇవ్వాలని బోర్డును కోరాడు. ఇదే విషయాన్ని ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా, మాజీ పేసర్​ ఇర్ఫాన్​ ఖాన్​ వేర్వేరు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

ఇదీ చూడండి... 'కోహ్లీ ప్రేయసితో చాట్​ చేస్తే అతడికి నచ్చేది కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.