ETV Bharat / sports

'ఆ సిరీస్​లో విఫలమయ్యా.. రవిశాస్త్రి సలహా పనికొచ్చింది'

2014లో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో తనకు ఎదురైన వైఫల్యాన్ని కీలకమైన మైలురాయిగా భావిస్తున్నట్లు టీమ్​ఇండియా సారథి కోహ్లీ తెలిపాడు. తాజాగా ఓపెన్​ నెట్స్​ విత్​ మయాంక్​ కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లీ.. తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నాడు.

Virat Kohli Reveals How Ravi Shastri Helped Him Improve His Performance On England Tour In 2018
కోహ్లీ
author img

By

Published : Jul 24, 2020, 3:57 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అలాంటి ఆటగాడు 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో విఫలమయ్యాడు. అతడి కెరీర్‌లో అంత ఘోరమైన ఓటమి ఎప్పుడూ చవిచూడలేదు. గతేడాది చివర్లో, ఈ ఏడాది ఆరంభంలోనూ కోహ్లీ ఫామ్‌ కోల్పోయి సతమతమయ్యాడు. తాజాగా, విరాట్ ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ అప్పటి ఇంగ్లాండ్‌ పర్యటనపై స్పందించాడు.

ఆ సిరీస్​ను తనకు కీలక మైలురాయిగా పేర్కొన్నాడు కోహ్లీ. చాలా మంది ఆటగాళ్లు బాగా ఆడిన పర్యటనగా భావిస్తారని, తాను మాత్రం విఫలమైన ఆ ఇంగ్లాండ్‌ టూర్‌ను అలా భావిస్తానని చెప్పాడు. ఆ పర్యటన తర్వాత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి వద్ద పలు సూచనలు, సలహాలు తీసుకున్నట్లు వెల్లడించాడు. తనతో పాటు శిఖర్‌ ధావన్‌ కూడా శాస్త్రి వద్ద ప్రత్యేక సెషన్‌ తీసుకున్నట్లు వివరించాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పంచుకుంది. త్వరలోనే ఆ పూర్తి ఇంటర్వ్యూను బీసీసీఐ వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది.

గురువారం విడుదల చేసిన వీడియోలో కోహ్లీని పిట్​నెస్​ విషయంలో తన తల్లి, కుటుంబ సభ్యులతో జరిగిన సరదా సన్నివేశాన్ని తెలపమని మయాంక్​ అడిగాడు. దీనికి కోహ్లీ స్పందిస్తూ.. తన ఫిట్‌నెస్‌ విషయంలో తల్లి సరోజ్‌ కోహ్లీ చాలా బెంగ పడేవారని చెప్పాడు.

"నేను బక్కచిక్కిపోయినట్లు మా అమ్మ అంటుండేది. అయితే, ప్రతి తల్లి అలా అనుకోవడం సహజమే. 'నువ్వు చాలా వీక్‌ అవుతున్నావు. ఏమైనా తింటున్నావా లేదా?' అని అడిగేది. మాతృమూర్తులకు తమ కుమారులపై ఉండే బెంగకు, ఆటగాళ్ల ప్రొఫెషనలిజమ్‌కి తేడా తెలియదు. వాళ్ల పిల్లలు లావుగా కనపడకపోతే ఏదో అయిపోయిందని కంగారు పడతారు" అని కోహ్లీ వివరించాడు. అలాగే తాను అనారోగ్యానికి గురయ్యానని కూడా తన తల్లి అంటుండేదని టీమ్‌ఇండియా సారథి చెప్పుకొచ్చాడు. ఇలాంటి సన్నివేశాలు సరదాగా అనిపించినా ఒక్కోసారి చాలా చిరాకు తెప్పిస్తాయన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.