ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు ఎంపిక కావడం గురించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మాట్లాడాడు. అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా ఉన్న ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ నుంచి కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించగల సత్తా విరాట్ సొంతమని తెలిపాడు.
"మానసిక ఒత్తిళ్లను జయించడానికి గతంలో కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయాన్ని విరాట్ సమర్థించాడు. ప్రపంచ క్రికెటర్లందరికీ ఇది అవసరమని అతడు సూచించాడు. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ ఒక శిఖరం" అని మాక్స్వెల్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: క్రికెటర్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం
గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 106 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్స్‌వెల్‌ను వేలానికి ముందే పంజాబ్ జట్టు వదులుకుంది. అయినా సరే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఇతడి గురించి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు ఆర్సీబీ రూ.14.25 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో ఉన్నాడు మ్యాక్స్‌వెల్.
ఇదీ చదవండి: ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లు