ETV Bharat / sports

ధోనీ రికార్డు సమం చేయడంపై కోహ్లీ ఏమన్నాడంటే?

అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ వహించడం సంతోషంగా ఉందని చెప్పాడు విరాట్ కోహ్లీ. తన సుదీర్ఘ ప్రయాణం నమ్మశక్యంగా లేదన్నాడు.

Virat Kohli on equalling MS Dhoni's captaincy record in 4th Test: Unbelievable captaining India for so long
ధోనీ రికార్డు సమం చేయడంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
author img

By

Published : Mar 4, 2021, 12:27 PM IST

టెస్టుల్లో సుదీర్ఘ కాలం టీమ్​ఇండియాకు నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని చెప్పాడు విరాట్ కోహ్లీ. తన ప్రయాణం నమ్మశక్యంగా లేదన్నాడు. ఇంగ్లాండ్​తో మొతేరాలో జరుగుతున్న టెస్టు మ్యాచ్​తో భారత్​ తరఫున 60టెస్టులకు కెప్టెన్సీ వహించిన సారథిగా ధోనీ సరసన చేరాడు కోహ్లీ.

"ఇంత సుదీర్ఘ సమయం భారత్​కు సారథ్యం వహించడం నమ్మశక్యంగా లేదు. ఈ ప్రయాణంలో భారత్​ అత్యుత్తమ ర్యాంకులను సాధించింది. టీమ్​ఇండియాలో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. మేము ఒక జట్టుగా కలిసి ఆడతాం. వారి వల్లే నాయకుడిగా నేను విజయవంతంగా కొనసాగుతున్నా."

-విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్

2014లో టెస్టులకు ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించిన తర్వాత సారథిగా పగ్గాలు అందుకున్నాడు కోహ్లీ. స్వదేశంలో విరాట్​కు కెప్టెన్​గా ప్రస్తుత మ్యాచ్​ 30వది. ఇటీవల అహ్మదాబాద్​లోనే జరిగిన మూడో టెస్టు విజయంతో స్వదేశంలో అత్యధిక విజయాలతో ధోనీని(21) అధిగమించాడు కోహ్లీ(22).

ఇదీ చూడండి: తొలి సెషన్​లో భారత్ జోరు.. ఇంగ్లాండ్ 74/3

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.