ETV Bharat / sports

'కోహ్లీని కవ్విస్తే పడుకున్న సింహాన్ని నిద్రలేపినట్లే' - dhoni latest news

మైదానంలో కోహ్లీ, ధోనీలను కవ్వించడం మంచిది కాదని చెప్పిన మాజీ క్రికెటర్ డీన్ జోన్స్.. అలా చేస్తే వారికి ప్రాణవాయివు అందినట్లేనని అన్నాడు.

'కోహ్లీని కవ్విస్తే పడుకున్న సింహాన్ని నిద్రలేపినట్లే'
టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ
author img

By

Published : Jun 3, 2020, 7:37 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని కవ్విస్తే అతడికి ప్రాణవాయువు అందించినట్టేనని మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ అన్నాడు. ఐపీఎల్‌లో కాంట్రాక్టుల కోసమే ఆస్ట్రేలియా క్రికెటర్లు అతడిని స్లెడ్జింగ్‌ చేయలేదన్న మైకేల్‌ క్లార్క్‌ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఘర్షణలను ఇష్టపడే కోహ్లీ, ధోనీలాంటి వారిని కవ్వించడం ఆసీస్‌ ఎప్పట్నుంచో మానేసిందని వివరించాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో జోన్స్‌ ఈ విధంగా మాట్లాడాడు.

"విరాట్‌ను ఎందుకు కవ్వించలేదో నేను చెబుతా. ఎందుకంటే వివ్‌ రిచర్డ్స్‌ బ్యాటింగ్‌ చేసేందుకు వస్తే మేం నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. జావెద్‌ మియాందాద్‌, మార్టిన్‌ క్రో వచ్చినా అలాగే చేసేవాళ్లం. ఎందుకంటే పడుకున్న సింహాన్ని నిద్రలేపొద్దు. ధోనీ, కోహ్లీని కవ్వించొద్దు. ఎందుకంటే వారు ఘర్షణను ఇష్టపడతారు. వారికి అనవసరంగా ప్రాణవాయువు అందించొద్దు. ఐపీఎల్‌ కాంట్రాక్టుల కోసం విరాట్‌ను కవ్వించలేదన్నది మాత్రం అబద్ధం. అతడు ఎవరినైనా ఆపుతాడా? ఇది కోచ్‌లు, మేనేజర్లకు సంబంధించిన అంశం" అని జోన్స్‌ వివరించాడు.

KOHLI WITH DHONI
కోహ్లీతో ధోనీ

2018 చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమ్‌ఇండియా, తొలిసారి బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాల్‌ ట్యాంపరింగ్‌ నిషేధం కారణంగా ఆ సిరీస్‌లో స్మిత్‌, వార్నర్‌ లేరు. ఐపీఎల్‌ కాంట్రాక్టుల కోసమే ఆసీస్‌ స్ఫూర్తిని పట్టించుకోకుండా స్లెడ్జింగ్‌ చేయలేదని క్లార్క్‌ గతంలో అన్నాడు. దానిపై మరోసారి జోన్స్‌ స్పందించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.