ప్రపంచంలోని ప్రస్తుత వన్డే బ్యాట్స్మెన్లలో తన దృష్టిలో విరాట్ కోహ్లీ అత్యుత్తమమని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ విలక్షణ ఆటగాడని తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న స్మిత్.. ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు.
మీ దృష్టిలో ప్రపంచంలోనే ఉత్తమ వన్డే బ్యాట్స్‌మన్?
స్మిత్ : ప్రస్తుతం అయితే విరాట్ కోహ్లీ.
![Virat Kohli best ODI best batsman in world: Steve Smith ahead of IPL 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8745722_2.jpg)
ఏబీ డివిలియర్స్ గురించి ఒక్క మాటలో?
స్మిత్ : విలక్షణ ఆటగాడు
![Virat Kohli best ODI best batsman in world: Steve Smith ahead of IPL 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8745722_3.jpg)
సంజూ శాంసన్ గురించి ఒక్క మాటలో?
స్మిత్ : ప్రతిభావంతుడైన క్రికెటర్
![Virat Kohli best ODI best batsman in world: Steve Smith ahead of IPL 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8745722_4.jpg)
కేఎల్ రాహుల్ గురించి ఒక్క మాటలో?
స్మిత్ : గన్
![Virat Kohli best ODI best batsman in world: Steve Smith ahead of IPL 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8745722_5.jpg)
హాయ్ స్టీవ్! జోస్ బట్లర్ గురించి ఏదైనా చెప్పండి?
స్మిత్ : భయంకరమైన ఆటగాడు. ఈ వారం జరగబోయే వన్డేల్లో మా జట్టుపై ఎలాంటి పరుగులు చేయకూడదని కోరుకుంటున్నాను. ఐపీఎల్లో తనకు ఇష్టమైనన్ని పరుగులు చేయొచ్చు (నవ్వుతూ).
![Virat Kohli best ODI best batsman in world: Steve Smith ahead of IPL 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8745722_6.jpg)
క్రికెట్లో ఎప్పటికీ మీరు అభిమానించే ఫీల్డర్స్?
స్మిత్ : జాంటీ రోడ్స్, రికీ పాంటింగ్
![Virat Kohli best ODI best batsman in world: Steve Smith ahead of IPL 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8745722_7.jpg)
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది ఆస్ట్రేలియా. ఇటీవలే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయ్యాక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ చేరుకుంటారు. ఈ నెల 19 నుంచి ఆరంభం కానుంది టోర్నీ. చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.