టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన సతీమణి, నటి అనుష్కశర్మను ఓడించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. తాను ఓడిపోవట్లేదని, ఇంట్లోనే ఉంటూ సామాజిక దూరం పాటించడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పింది.
అయితే ఆ ఫొటోలో 'లూడోగేమ్' కనిపించడం వల్ల ఆమె కోహ్లీ చేతిలో ఆన్‌లైన్ గేమ్‌లో ఓడినట్లు అర్థమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించగానే విరుష్క దంపతులు ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు.
ఇటీవల అనుష్క తల్లిదండ్రులతో కలిసి మోనోపొలి ఆడింది. అంతకుముందు కోహ్లీకి జుత్తు కత్తిరిస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. తాజాగా అతడిని ఫోర్ కొట్టమని ఆటపట్టించే వీడియోనూ పోస్టు చేసింది అనుష్క.