ETV Bharat / sports

'కోహ్లీ, నేను మంచి స్నేహితుల్లా ఉండేవాళ్లం' - 'కోహ్లీ, నేను మంచి మిత్రుల్లా ఉండేవాళ్లం!'

ప్రస్తుతం తాను ఆడుతూ ఉండుంటే కోహ్లీతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకునే వాడినని చెప్పాడు పాక్​ మాజీ బౌలర్​​ అక్తర్​. తాజాగా జరిగిన ఓ ఇన్​స్టా లైవ్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

Virat Kohli and I would have been real enemies on the field: Shoaib Akhtar
'కోహ్లీ, నేను మంచి మిత్రుల్లా ఉండేవాళ్లం!'
author img

By

Published : May 27, 2020, 11:01 AM IST

ప్రస్తుత క్రికెట్​లో తాను ఉండుంటే, టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీతో మంచి అనుబంధం కొనసాగించే వాడినని చెప్పాడు పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​. మైదానంలో శత్రువుల్లాగా, బయట మంచి స్నేహితులుగా మెలిగేవాళ్లమని తెలిపాడు.

"పంజాబీలు కావడం వల్ల నేను, కోహ్లీ మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. కానీ, మైదానంలో అడుగుపెడితే శత్రువులుగా అత్యుత్తమంగా ఆడేవాళ్లం. నా బౌలింగ్​లో కట్​, పుల్​షాట్​లు ఆడలేవని తనకు చెప్పేవాడిని. కోహ్లీ బ్యాటింగ్​ చేస్తుంటే వికెట్లకు దూరంగా బంతిని విసురేవాడినని. ఆ సమయంలో తనకు ఇష్టమైన షాట్​ను ఆడమని బలవంతం చేసేవాడిని"

-షోయబ్​ అక్తర్​, పాకిస్థాన్​ మాజీ పేసర్​

మరోవైపు కోహ్లీ ఆటపై దృష్టిని మరల్చేలా, అతడిని మాటలతో మాయ చేసేవాడినని చెప్పాడు అక్తర్​. కోహ్లీతో ఛాలెంజ్​ చేస్తే అతడు ఆట​పై మరింత దృష్టి సారిస్తాడని తెలిపాడు. వసీం అక్రమ్​, వకార్​ యూనిస్​, షేన్​ వార్న్​ లాంటి బౌలర్లను ఎదుర్కొనే ఛాలెంజ్​లనూ కోహ్లీ ఆస్వాదించేవాడని షోయబ్​ అన్నాడు.

అక్తర్​.. పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో 224 మ్యాచ్​లు ఆడాడు. 444 వికెట్లు తీశాడు. మరోవైపు అగ్రశ్రేణి బ్యాట్స్​మన్​గా కొనసాగుతున్న కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 70 శతకాలు నమోదు చేశాడు. దిగ్గజ సచిన్ తెందుల్కర్ 100 సెంచరీల ఘనతను అధిగమించేలా కనిపిస్తున్నాడు.

ఇదీ చూడండి... పోలీసు విధుల్లో భారత మహిళా ఫుట్​బాలర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.