టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మా అభిమాన క్రికెటరే గెలుస్తాడు అనేంతలా ఫ్యాన్స్ మధ్య వైరం నడుస్తోంది? అదేంటి వీరిద్దరూ ఎప్పుడు తలపడ్డారని అనుకుంటున్నారా! మ్యాచ్లో కాదులేండి ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో పెట్టిన ఓ పోటీ.. వీరిద్దరి అభిమానుల నడుమ వైరం పెట్టేదిగా మారింది. ఎందుకంటారా?
గత దశాబ్దంలో (2010-2019) మీకు నచ్చిన పురుష క్రికెటర్ ఎవరు? అని క్రిక్‌ఇన్ఫో పోటీ పెట్టింది. కొంతమంది క్రికెటర్లను ఎంపిక చేసి పోల్ నిర్వహిస్తోంది. ఇప్పుడిది సెమీఫైనల్ దశకు చేరుకుంది. సెమీస్‌లో విరాట్ కోహ్లీXకేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్Xఎంఎస్ ధోనీ పోటీ పడుతున్నారు. కోహ్లీ, ధోనీకి 75 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. అంటే ఫైనల్లో తలపడేది వారేనని తెలిసిపోయింది. పోటీల్లో ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ కలుగుతోంది. సెమీస్ ఓటింగ్ 2020, జనవరి 5, ఉదయం 10 గంటలకు ముగుస్తుంది.
సెమీస్‌లో మహీని గెలిపించేందుకు అతడి అభిమానులు భారీ స్థాయిలో ఓట్లు వేస్తున్నారు. ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ధోనీ ట్యాగులైన్ ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా ధోనీ గురించి ట్వీట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అవగాహన లేకుండా మాట్లాడను: విరాట్ కోహ్లీ