ETV Bharat / sports

మాల్యాకు షాక్​- సీపీఎల్​ ఓనర్​షిప్​ రద్దు!

భారతీయ పారిశ్రామిక వేత్త, రుణ ఎగవేతదారు విజయ్​ మాల్యాకు మరో దెబ్బ తగలనుంది. కరీబియన్​ లీగ్​లోని బార్బడోస్​ ట్రిడెంట్స్​ జట్టు యాజమాన్య హక్కులు కోల్పోనున్నారు. 2018 ఏడాదికి చెందిన ఆటగాళ్ల జీతాలు చెల్లించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు సీపీఎల్​ నిర్వాహకులు.

మాల్యాకు ఎదురుదెబ్బ... కరీబియన్​ లీగ్​లో ఓనర్​షిప్​ రద్దు!
author img

By

Published : May 2, 2019, 10:54 AM IST

ఈ ఏడాది కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​ (సీపీఎల్)​ సెప్టెంబరు నుంచి ఆరంభం కానుంది. గతేడాది బార్బడోస్​ జట్టు ఆటగాళ్లకు మాల్యా చెల్లింపులు చేయకపోవడం వల్ల... యాజమాన్యాన్ని మార్చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు నిర్వాహకులు. ఇప్పటికే కొనుగోలుదారులతో చర్చలు జరపుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 22న ఆటగాళ్ల జాబితా, కొత్త యాజమాన్యాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

vijay-mallya-set-to-lose-ownership-of-barbados-tridents
సీపీఎల్​ జట్లు

ఏంటి కారణం...??

ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు మాజీ యజమాని విజయ్​మాల్యా బ్యాంకు రుణ ఎగవేత కేసులో నిందితుడు. భారత్​ నుంచి పారిపోయి బ్రిటన్​లో ఉంటున్నారు. ఆయన ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఆంక్షలు విధించింది భారత్​. ఫలితంగా 2018 లీగ్​ సెప్టెంబరులోనే ముగిసినా ఆటగాళ్ల జీతభత్యాల చెల్లింపులు జరగలేదు. మాల్యా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల యాజమాన్యం హోదాను రద్దు చేసేందుకు... సమాలోచనలు జరుపుతున్నట్లు లీగ్​ సీఈఓ డమిన్​ ఓ డొనొహో వెల్లడించారు.

'ఈ చెల్లింపుల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. బార్బడోస్​ సమస్య రెండు లేదా మూడు వారాల్లో తీరిపోతుంది. ఈ జట్టుకు కొత్త యాజమాన్యాన్ని త్వరలో ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం.'
--​డమిన్​ ఓ డొనొహో, సీపీఎల్​ సీఈఓ

ట్రిడెంట్స్​ జట్టు ఆటగాడు డ్వేన్​ స్మిత్​ ఇటీవల సీపీఎల్​పై విమర్శలు గుప్పించాడు. జీతాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్పందించిన సీపీఎల్​ నిర్వాహకులు​... సమస్యను త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదొక గుణపాఠమని మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఆటగాళ్లకు హామీనిచ్చారు. ఈ ఏడాది సీపీఎల్ లీగ్​ మ్యాచ్​లు​ సెప్టెంబరు 4 నుంచి అక్టోబర్​ 12 వరకు జరగనున్నాయి.

సెప్టెంబరు 4 నుంచి లీగ్​ ప్రారంభం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.