విజయ్ హజారే ట్రోఫీలో శతకాలతో జోరు మీదున్నాడు దేవ్‌దత్ పడిక్కల్. సోమవారం వరుసగా నాలుగో సెంచరీ చేశాడు ఈ కర్ణాటక యువ సంచలనం. కేరళతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 119 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
అంతకుముందు వరుసగా ఒడిశాపై (152), కేరళపై (126*), రైల్వేస్‌పై (145*) శతకాలు చేశాడు పడిక్కల్. దేవ్‌దత్ కన్నా ముందు 2015 ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు. 2015-16 మొమెంటమ్ వన్డే కప్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ అల్విరో పీటర్సన్ కూడా వరుసపెట్టి నాలుగు శతకాలు బాదాడు.
కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్‌తో పాటు కెప్టెన్ సమర్థ్ సెంచరీ(192)తో మెరిసిన వేళ కర్ణాటక 338/3 పరుగులు చేసింది. మూడు వికెట్లనూ కేరళ బౌలర్ ఎన్పీ బాసిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌తో 'పొట్టి పోరు'లో ఆ ముగ్గురికి చోటు దక్కేనా?