అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, ఫేవరేట్లలో ఒకటైన భారత్.. మరోసారి సత్తా చాటుతోంది. నాకౌట్ పోరులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను వణికిస్తోంది.
త్యాగి అత్యుత్తమంగా...
తొలుత బ్యాటింగ్ చేసిన యువ టీమిండియా 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే దెబ్బతీశాడు పేసర్ కార్తీక్ త్యాగి. కంగారూ జట్టు పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ పడగొట్టి పతనం ప్రారంభించారు భారత బౌలర్లు. తొలి బంతికే ఆసీస్ ఓపెనర్ గ్రుక్ను రనౌట్‌గా పంపించారు. అదే ఓవర్ నాలుగో బంతికి హార్వేను ఎల్బీగా ఔట్ చేసిన త్యాగి.. తర్వాతి బంతికి మరో బ్యాట్స్‌మన్ హెర్నేను బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత మూడో ఓవర్లో మళ్లీ బంతి అందుకున్న ఈ యువ ఫాస్ట్ బౌలర్.. మరో బ్యాట్స్‌మన్ ఒలీవర్ను పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు.
-
Australia are now 17/4 after 2.3 overs!
— Cricket World Cup (@cricketworldcup) January 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Kartik Tyagi has his third wicket, Yashasvi Jaiswal taking a very smart catch in the slips 👏 #U19CWC | #INDvAUS | #FutureStars pic.twitter.com/xWeomVPnmn
">Australia are now 17/4 after 2.3 overs!
— Cricket World Cup (@cricketworldcup) January 28, 2020
Kartik Tyagi has his third wicket, Yashasvi Jaiswal taking a very smart catch in the slips 👏 #U19CWC | #INDvAUS | #FutureStars pic.twitter.com/xWeomVPnmnAustralia are now 17/4 after 2.3 overs!
— Cricket World Cup (@cricketworldcup) January 28, 2020
Kartik Tyagi has his third wicket, Yashasvi Jaiswal taking a very smart catch in the slips 👏 #U19CWC | #INDvAUS | #FutureStars pic.twitter.com/xWeomVPnmn
మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్ బ్యాట్స్‌మన్‌లో యశస్వి(62), అథర్వ(55) అర్ధ శతకాలతో రాణించారు.
ఇదీ చూడండి...