ETV Bharat / sports

స్థానిక అంపైర్లకు 'లెండింగ్ హ్యాండ్' ఆర్థిక సాయం - ముంబయి క్రికెట్ అసోసియేషన్

ముంబయి క్రికెట్ అసోసియేషన్ పరిధిలో పనిచేసే స్థానిక అంపైర్లు, స్కోరర్లను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు 'లెండింగ్ హ్యాండ్' స్థాపకుడు, బీసీసీఐ మాజీ అంపైర్ గణేశ్ అయ్యర్.

స్థానిక అంపైర్లకు 'లెండింగ్ హ్యాండ్' ఆర్థిక సాయం
అంపైర్లు
author img

By

Published : Apr 3, 2020, 5:30 AM IST

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. భారత్​లోనూ ఈ వైరస్​ వ్యాప్తి పెరుగుతుండటం వల్ల 21 రోజుల లాక్​డౌన్ విధించారు. ఐపీఎల్​తో సహా వివిధ పోటీలు వాయిదా పడ్డాయి. దీంతో స్థానిక మ్యాచ్​ల్లో ఉండే అంపైర్లు, స్కోరర్లు ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు వీరిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు బీసీసీఐ మాజీ అంపైర్, ముంబయి క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు గణేశ్ అయ్యర్. తన మిత్రులతో కలిసి 'లెండింగ్ హ్యాండ్​' పేరుతో ఓ సంస్థను స్థాపించారు. అనంతరం ఈ విషయంపై మాట్లాడారు.

"మ్యాచ్​లు రద్దు కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించాం. సభ్యులు విరాళాలిచ్చిన మొత్తం కలిపి రూ.2.5 లక్షలు పోగైంది. ముంబయి క్రికెట్ అసోసియేషన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు.. తమ ఉదారత చాటుకున్నారు. ఇప్పటివరకు 47 మంది అంపైర్లు, 15 మంది స్కోరర్లు ఉన్నారని గుర్తించాం. సహాయంగా తొలుత రూ.3 వేలు చొప్పున వారి బ్యాంక్​ ఖాతాల్లో వేయనున్నాం. మిగతా అవసరాల్ని మరో వారం- పది రోజుల్లో తీరుస్తాం" -గణేశ్ అయ్యర్, ముంబయి క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు

ముంబయి క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నీల్లో అంపైర్లుగా పనిచేసేవారికి రోజుకు రూ.2 వేలు, స్కోరర్లకు రూ.1500 వేతనంగా చెల్లిస్తారని ఎంసీఏ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు మ్యాచ్​లు జరగకపోవడం వల్ల వారికి రాబడి లేకుండా పోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.