ETV Bharat / sports

'ఐపీఎల్​ నిర్వహణకు మేం ఎప్పుడో సిద్ధం'

ఐపీఎల్​ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు దుబాయ్​ స్పోర్ట్స్​ సిటీస్​ హెడ్​ ఆఫ్​ క్రికెట్​ అండ్​​ ఈవెంట్స్​ సల్మాన్​ హనీఫ్​ తెలిపారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మ్యాచ్​లు జరిగేలా స్టేడియంలో చాలినన్ని పిచ్​లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

UAE keeping itself ready in case IPL comes calling
ఐపీఎల్
author img

By

Published : Jul 17, 2020, 3:35 PM IST

భారత్​లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఇటీవలే ఐపీఎల్​ను నిరవధిక వాయిదా వేశారు. ఈ క్రమంలోనే లీగ్​ను యూఏఈలో నిర్వహించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా, ఈ విషయంపై దుబాయ్​ స్పోర్ట్స్​ సిటీస్​ క్రికెట్​ అండ్​ ఈవెంట్స్​ హెడ్​ సల్మాన్​ హనీఫ్​ స్పందించారు. ఇటువంటి పోటీలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

UAE keeping itself ready in case IPL comes calling
ఐపీఎల్​

''ఒకవేళ తక్కువ వ్యవధిలో ఎక్కువ మ్యాచ్​లను నిర్వహించాలని అనుకుంటే స్టేడియంలో చాలినన్ని వికెట్​ పిచ్​ల సదుపాయం ఉంది. అంతే కాకుండా, పిచ్​ను తాజాగా ఉంచేందుకు ఈ వ్యవధిలో ఎలాంటి మ్యాచ్​లను నిర్వహించం.''

- సల్మాన్​ హనీఫ్​

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై ఆనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. ఐపీఎల్​ను సెప్టెంబర్​- అక్టోబర్​ మధ్య జరపాలని అధికారులు భావిస్తున్నారు. ఐపీఎల్​ను విదేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పటికీ.. ఈ ఏడాది లీగ్​ జరిగేలా చూడాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు.

యూఏఈలో ఐపీఎల్​

మరోవైపు వచ్చే వారం నాటికి టీ 20 ప్రపంచ కప్​ నిర్వహణపై ఐసీసీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అనుకున్నట్లుగా సెప్టెంబరులో ఐపీఎల్​కు షెడ్యూల్​ కుదిరితే.. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు ప్రాక్టీస్ ​కోసం కొంచెం ముందుగానే స్టేడియాలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్​ ఎక్కడ జరుగుతుందనేది ఇంకా స్పష్టత లేదు.

లాక్​డౌన్​ కారణంగా దాదాపు 6 నెలల నుంచి టీమిండియా క్రికెటర్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇటీవలే కొంత మంది సొంతంగా నెట్​ ప్రాక్టీసు ప్రారంభించారు.

ఇదీ చూడండి:ట్రైనింగ్​ ఇస్తే ఇప్పుడూ క్రికెట్​ ఆడేస్తా: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.