ETV Bharat / sports

టాప్​-5: ఐపీఎల్​లో అత్యధిక అర్ధశతకాల వీరులు! - ఐపీఎల్​లో అత్యధిక హాఫ్​ సెంచరీలు సాధించిన క్రికెటర్లు

వన్డే, టెస్టు ఫార్మాట్​లో హాఫ్​సెంచరీల కన్నా సెంచరీలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘమైన ఇన్నింగ్స్​తో చివరి వరకు నిలకడగా రాణిస్తూ.. పరుగులను రాబట్టడం చాలా కష్టం. కానీ, ఐపీఎల్​ వంటి పొట్టి ఫార్మాట్​లో శతకాలను నమోదు చేసిన పరిస్థితులు అరుదుగా ఉన్నప్పటికీ.. అర్ధశతకాలే కొన్ని విజయాలకు కారణమవుతాయి. అలాంటి హాఫ్ సెంచరీలను ఐపీఎల్​ కెరీర్​లో ఎక్కువసార్లు సాధించిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా.

Top five: Most 50 plus scores in the IPL
టాప్​-5: ఐపీఎల్​లో అత్యధికంగా అర్థశతకాలను చేసిన ఆటగాళ్లు
author img

By

Published : Jul 27, 2020, 6:41 PM IST

Updated : Jul 27, 2020, 7:30 PM IST

టీ20 క్రికెట్​లో బ్యాటింగ్​ ఆర్డర్​తో సంబంధం లేకుండా ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. టాపార్డర్ బ్యాట్స్​మెన్ల దగ్గర నుంచి చిన్న హిట్టర్స్​ వరకు అందరూ ఈ ఫార్మాట్​లో పరుగులు రాబట్టడానికే ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఈ టోర్నీలో వ్యక్తిగత స్కోరు మూడంకెల పరుగులను చేరుకున్న పరిస్థితులు అరుదుగా ఉన్నప్పటికీ.. బ్యాట్స్​మెన్​ చేసిన అర్ధశతకాలే టోర్నీలో ఎక్కువ సార్లు గేమ్​ చేంజర్స్​గా మారాయి.

టాపార్డర్ బ్యాట్స్​మన్​గా బరిలో దిగిన ఆటగాళ్లు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున యాభై పరుగుల మార్క్​ను సాధించడానికి వారికి వీలుపడుతుంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 12 సీజన్లలో అత్యధికంగా 50+ రన్స్​ నమోదు చేసిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.

డేవిడ్​ వార్నర్​ (దిల్లీ, హైదరాబాద్​) -48

ఐపీఎల్​లో మొదటి నుంచి నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్​మెన్లలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్​ వార్నర్ ఒకరు​. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించడం సహా అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ప్రత్యర్థి బౌలర్లను తన షాట్లతో ఉక్కిరిబిక్కిరి చేయడంలో వార్నర్​కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వార్నర్.. ఐపీఎల్​లో ప్రస్తుతం సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్​లో ఇప్పటివరకు 48కి పైగా 50 ప్లస్​ స్కోర్​ను నమోదు చేశాడు. అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాట్స్​మెన్ల జాబితాలో వార్నర్​ ఆగ్రస్థానంలో ఉన్నాడు.

Top five: Most 50 plus scores in the IPL
డేవిడ్​ వార్నర్

వార్నర్​ ఐపీఎల్​ కెరీర్​లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో ఇతడు చేసిన అత్యధిక స్కోరు 126. 2009-2019 మధ్య ఆడిన 126 మ్యాచ్​లలో వార్నర్​ ప్రతి మ్యాచ్​లోనూ బ్యాటింగ్​కు దిగి.. 43.17 సగటుతో 4,706 పరుగులతో టోర్నీలో టాప్​ స్కోరర్​లలో ఒకడిగా నిలిచాడు. వార్నర్​ చేసిన ప్రతి అర్ధశతకం ఆ జట్టు విజయంలో కీలకంగా నిలిచింది. 48 అర్ధశతకాల్లో నాలుగు శతకాలు ఉన్నాయి. సెంచరీల జాబితాలో క్రిస్​ గేల్​, విరాట్​ కోహ్లీల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు డేవిడ్​ వార్నర్​.

విరాట్​ కోహ్లీ (రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు)- 41

ఆధునిక బ్యాట్స్​మెన్లలో అన్ని ఫార్మట్లలో రాణించగల గొప్ప ఆటగాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. ఫార్మాట్​ను బట్టి తన ఆటతీరును మార్చుతూ టాప్​ క్రికెటర్​గా కొనసాగుతున్నాడు. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు దశాబ్దం కాలంగా కెప్టెన్​గా ఉంటూ తన జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

విరాట్​ కోహ్లీ

మూడో స్థానంలో ఎక్కువగా బ్యాటింగ్​ చేసే విరాట్​.. ఇప్పటివరకు ఐపీఎల్​ కెరీర్​లో 177 మ్యాచ్​ల్లో 5,412 రన్స్​ చేశాడు. 41 సార్లు యాభైకి పైగా పరుగులను సాధించగా.. అందులో 36 అర్ధసెంచరీలు 5 సెంచరీలున్నాయి. ఐపీఎల్​ టోర్నీలో అత్యధిక 50 ప్లస్​ స్కోర్స్​ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

సురేశ్​ రైనా (చెన్నై సూపర్​ కింగ్స్​, గుజరాత్​ లయన్స్​)- 39

ఐపీఎల్​లో అత్యధిక అర్ధశతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్​ సురేశ్​ రైనా. ఈ టోర్నీలో చెన్నై సూపర్​కింగ్స్​, గుజరాత్​ లయన్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 193 మ్యాచ్​లు ఆడి.. 39 సందర్భాల్లో 50కిపైగా పరుగులను రాబట్టాడు.

సురేశ్​ రైనా

2013లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై 53 బంతుల్లో సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు రైనా. ఐపీఎల్​ కెరీర్​లో 137 కంటే ఎక్కువ స్ట్రైక్​రేట్​తో 5,368 పరుగులను సాధించాడు.

శిఖర్​ ధావన్​(దక్కన్ ఛార్జర్స్, ముంబయి, హైదరాబాద్​, దిల్లీ), రోహిత్​ శర్మ (దక్కన్ ఛార్జర్స్​, ముంబయి) - 37

అంతర్జాతీయ మ్యాచ్​లలో టీమ్​ఇండియా తరపున విధ్వంసక ఓపెనర్లుగా నిరూపించుకున్నారు శిఖర్​ ధావన్​, రోహిత్​ శర్మ. ఐపీఎల్​ కెరీర్​లో ధావన్​ నాలుగు వేర్వేరు ఫ్రాంచైజీలతో భాగమవ్వగా.. రోహిత్​ శర్మ రెండు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ధావన్​.. ఆడిన 159 మ్యాచ్​లలో 37కి పైగా 50 ప్లస్​ రన్స్​ చేశాడు. సెంచరీ మాత్రం లేదు.

శిఖర్​ ధావన్​, రోహిత్​ శర్మ

రోహిత్​ శర్మ.. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. ముంబయి టీమ్​కు ప్రాతినిధ్యం వహిస్తూ.. నాలుగు సార్లు టైటిళ్లు గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు హిట్​మ్యాన్​. ముంబయి తరపున ఆడిన 188 మ్యాచ్​ల్లో రోహిత్​ శర్మ.. 37 సార్లు 50కిపైగా పరుగులు సాధించగా.. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్​ చరిత్రలో అత్యధికంగా 50 ప్లస్​ రన్స్​ చేసిన బ్యాట్స్​మెన్​ జాబితాలో రోహిత్​, ధావన్​లు నాలుగో స్థానంలో ఉన్నారు.

ఏబీ డివిలియర్స్​ (దిల్లీ, బెంగళూరు), గౌతమ్​ గంభీర్​ (దిల్లీ, కోల్​కతా)- 36

ఐపీఎల్​ అభిమానులకు అత్యంత ప్రియమైన విదేశీ ఆటగాడు, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​. అనేక సందర్భాలలో తన ఆటతీరుతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాడు. ఐపీఎల్​ కెరీర్​లో 154 మ్యాచ్​లు ఆడిన డివిలియర్స్​.. 36 సందర్భాలలో 50కిపైగా పరుగులను సాధించగా.. అందులో మూడు శతకాలున్నాయి. 151.23 స్ట్రైక్​ రేట్​తో 4,395 రన్స్​ను నమోదు చేశాడు డివిలియర్స్​.

ఏబీ డివిలియర్స్​, గౌతమ్​ గంభీర్​

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 2012, 2014 ఐపీఎల్​ టోర్నీల్లో కోల్​కతా జట్టు రెండు సార్లు ట్రోఫీ గెలుచుకోవడంలో కెప్టెన్​గా కీలకపాత్ర పోషించాడు. పదేళ్ల ఐపీఎల్​ కెరీర్​లో అసాధరణమైన టాపార్డర్​ బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయనప్పటికీ 36 సార్లు యాభైకి పైగా పరుగులను సాధించి జట్టు విజయాల్లో భాగమయ్యాడు.

Last Updated : Jul 27, 2020, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.