సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు చివరి రోజున ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్, టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అశ్విన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడ్ని ఏకాగ్రత దెబ్బ తీసేందుకు పైన్ వ్యాఖ్యలు చేశాడు. దానికి బదులుగా తనదైన రీతిలో పైన్‌కు స్వీట్వార్నింగ్ ఇచ్చాడు అశ్విన్. వారిద్దరి సంభాషణ స్టంప్స్ మైక్‌లో రికార్డు అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
-
Conversation between Tim Paine and Ravi Ashwin.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Paine: "Can't wait for the Gabba Test".
Ravi Ashwin: "Can't wait to see you in India, that will be your last series". pic.twitter.com/0yWs9jLUqW
">Conversation between Tim Paine and Ravi Ashwin.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2021
Paine: "Can't wait for the Gabba Test".
Ravi Ashwin: "Can't wait to see you in India, that will be your last series". pic.twitter.com/0yWs9jLUqWConversation between Tim Paine and Ravi Ashwin.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2021
Paine: "Can't wait for the Gabba Test".
Ravi Ashwin: "Can't wait to see you in India, that will be your last series". pic.twitter.com/0yWs9jLUqW
టిమ్‌పైన్: నిన్ను గబ్బా(బ్రిస్బేన్ టెస్టు)లో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్!
అశ్విన్: మేము కూడా మిమ్మల్ని భారత్‌లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్ కావొచ్చు.
ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగింది టీమ్ఇండియా. 98/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో మరో 3 వికెట్లు కోల్పోయి 131 ఓవర్లలో 334/5 స్కోరు సాధించింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.
జాతివివక్ష వ్యాఖ్యలు
సిడ్నీ టెస్టులో ఆసీస్ ఆటగాళ్ల కవ్వింపులతో పాటు టీమ్ఇండియా క్రికెటర్లపై ప్రేక్షకులు జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. బుమ్రా, సిరాజ్‌లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వల్ల ఆరుగురు వీక్షకులను స్టేడియం నుంచి బహిష్కరించారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా జెంటిల్మెన్ గేమ్.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు