ETV Bharat / sports

ఆసీస్​పై అత్యధిక పరుగులు చేసిన భారత వీరులు వీరే!

నవంబర్​ 27నుంచి ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా సిరీస్​ ఆడనుంది. ఈ సందర్భంగా ఆసీస్​తో ఇప్పటివరకు ఆడిన సిరీస్​లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్​మెన్స్​ ఎవరో తెలుసుకుందాం.

author img

By

Published : Nov 20, 2020, 6:22 AM IST

three indian batsmen
భారత బ్యాట్స్​మెన్స్​

​మరో వారం రోజుల్లో ఆస్ట్రేలియాతో సిరీస్​ ప్రారంభం కానుంది. కరోనా తర్వాత టీమ్​ఇండియా ఆడే తొలి సిరీస్​ ఇదే కావడం వల్ల క్రీడాప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ఆసీస్​తో ఇప్పటివరకు జరిగిన పోరుల్లో(అన్ని ఫార్మాట్లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన భారత్​కు చెందిన తొలి ముగ్గురు బ్యాట్స్​మెన్స్​పై ఓ లుక్కేద్దాం.

3. వీవీఎస్​ లక్ష్మణ్​

సొగసరి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించిన పోరాట యోధుడు​​. ఆసీస్​తో ఆడిన 73ఇన్నింగ్స్​లో 48.81స్ట్రైక్​రేట్​తో 3,173పరుగులు చేశాడు. అందులో 10శతకాలు, 14 అర్ధశతకాలు​ ఉన్నాయి.

ఎప్పటికీ గుర్తుండిపోయేది

2001లో ఈడెన్​గార్డెన్స్​లో జరిగిన ఓ టెస్ట్​ మ్యాచ్​ అందరికీ గుర్తుండిపోతుంది. అందులో లక్ష్మణ్​ అజేయంగా 281పరుగులు చేసి మ్యాచ్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

laxman
లక్ష్మణ్​

2.విరాట్​ కోహ్లీ

టీమ్​ఇండియా కోహ్లీ సారథ్యంలో 2018లో తొలిసారి ఆసీస్​ గడ్డపై టీమ్​ఇండియా విజేతగా నిలిచింది. మొత్తంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై విరాట్​ 87 ఇన్నింగ్స్​ ఆడగా.. 53.22 స్ట్రైక్​రేట్​తో 4,098 పరుగులు చేశాడు. అందులో 15శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి.

kohli
కోహ్లీ

1.సచిన్​ తెందుల్కర్​

భారత క్రికెట్​ దిగ్గజం సచిన్​తెందుల్కర్​.. అడుగు పెట్టని మైదానం లేదు, పరుగులు చేయని పిచ్‌ లేదు, రికార్డు సృష్టించని దేశం లేదు. దేశానికి ఎన్నో విజయాలను అందించాడు. ఆసీస్​పై తాను ఆడిన 144 ఇన్నింగ్స్​ ​.. 49.68స్ట్రేక్​రేట్​తో 6,707పరుగులు చేశాడు. అందులో 20సెంచరీలు, 31అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ పరుగులను ఒక్క టీ20కూడా ఆడకుండానే కేవలం వన్డేలు, టెస్టులులో చేశాడు.

వెలుగులోకి

1991-92లో ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటించింది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో సచిన్ అజేయంగా 148 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. అప్పుడు అతడి వయసు పద్దెనిమిదేళ్లు. ఈ మ్యాచ్​తోనే మాస్టర్​ బ్లాస్టర్​ వెలుగులోకి వచ్చాడు.

sachin
సచిన్​

త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే షెడ్యూల్​

మూడు వన్డేల సిరీస్​తో ఆస్ట్రేలియాలో భారత్​ పర్యటన ప్రారంభం కానుంది. నవంబరు 27, 29, డిసెంబరు 2 తేదీల్లో వన్డేలు, డిసెంబరు 4, 6, 8 తేదీల్లో టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత టెస్టులకు అడిలైడ్​ (డిసెంబర్​​ 17-21), మెల్‌బోర్న్‌ (డిసెంబర్​ 26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్‌ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.

ఇదీ చూడండి : యువ జోరుకు టీ20 ప్రపంచకప్​లో చోటు పక్కా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.